ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 తీవ్ర రూపు దాల్చడంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ లాక్ డౌన్, కర్ఫ్యూను ఈ నెల 20వరకు పొడిగించింది. అయితే, కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోగా…త్వరలోనే చిన్న పిల్లలకు ముప్పు తెచ్చే థర్డ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ హెచ్చరికల ప్రకారం ఏపీ సీఎం జగన్ …పిడియాట్రిక్ కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రులపై ఫోకస్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇటువంటి నేపథ్యంలోనూ జగన్…పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై మాత్రం పట్టు విడవడం లేదు.
ఏపీలో పిల్లలకు తాను జగన్ మామ అంటూ చెప్పుకునే జగన్….పరీక్షల విషయంలో మాత్రం మొండి వైఖరి అవలంబించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఇంకా చెప్పాలంటే లోకేష్ ఉద్యమం చేయడం, హైకోర్టు సూచనలతోనే ఇంటర్ పరీక్షలను జగన్ వాయిదా వేశారు.
మరోపక్క పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా పరీక్షలు రద్దు చేయడానికి మొగ్గు చూపుతుంటే జగన్ , విద్యాశాఖామంత్రి సురేష్ పరీక్షలు పెట్టి తీరతామంటూ మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తీరుకు నిరసనగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
తిరుపతిలో వినూత్నరీతిలో నిరసన తెలిపిన నరసింహ ప్రసాద్…. విద్యార్థుల పాలిట సీఎం జగన్ కంసుమామలా తయారయ్యారని విమర్శించారు. స్కూల్ యూనిఫాం వేసుకొని..బ్యాగు తగిలించుకొని.చిన్న పిల్లాడిలా పరీక్షలు రద్దు చేయాలని ఏడుస్తూ నిరసన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆడుకుంటున్నారన్నారని దుయ్యబట్టారు.
కరోనా కన్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రమాదకరంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ, తమిళనాడులో పరీక్షలు రద్దు చేసినా, ప్రధాని మోదీ సీబీఎస్సీ పరీక్షలు రద్దు చేసినా…ఏపీ సర్కార్ లో చలనం లేదన్నారు. తక్షణమే పదోతరగతి పరీక్షలు రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పది, ఇంటర్ పరీక్షల రద్దుపై
ఏపీ ప్రభుత్వం ఆడుతున్న దోబూచులాట వల్ల విద్యార్థులు ఎంతగా మానసిక క్షోభకు గురవుతున్నారో కళ్ళకు కట్టినట్టు చెప్పారు @JaiTDP సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారు. @P_NPrasad ????#CancelAPboardexams2021
????pic.twitter.com/h7loUXFL4z— Balaji Gupta (@BalajiGupta) June 7, 2021