చంద్రబాబుని ద్వేషించు..కానీ ఆయన మార్గాన్ని ఆచరించు
71 ఏళ్లలో దాదాపు సగం కంటే ఎక్కువ సంవత్సరాలు చంద్రబాబు జనం మధ్యే వున్నాడు.
ఇన్నేళ్లలో ఆహార్యంలో గానీ, తీసుకునే ఆహారంలోగానీ ఏమైనా మార్పులు లేవు.
అంటే 40 ఏళ్లుగా ఒకటే వస్త్రధారణ, హెయిర్ స్టైల్, మిత శాఖాహారం ఆయన ఆరోగ్య రహస్యం.
40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం తెలిసిన వారు చంద్రబాబు ఎప్పుడైనా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారా?
పరిపాలనకి దూరం అయ్యారా? అంటే చూసిన వారెవ్వరూ లేదని బల్ల గుద్దీ మరీ చెబుతారు. ఒకట్రెండు సార్లు తప్ప..
అంటే ఆయనకి తల్లిదండ్రుల జీన్స్ నుంచి వచ్చిన వెలకట్టలేని ఆస్తి ఆరోగ్యం..దానిని చెక్కుచెదరకుండా కాపాడుకున్నారు.
స్కూల్కెళ్లే పిల్లాడు కూడా దృష్టి సమస్యలతో కళ్లద్దాలు వేసుకుంటున్నారు, ఊబకాయంతో బాధపడుతున్న ఈ రోజుల్లో
నిత్యమూ పనిఒత్తిడితో వుండే అత్యంత బిజీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు 72 ఏళ్ల వయస్సులోనూ సిక్స్ ప్యాక్ లెక్క శరీరదారుఢ్యం ఎవరికైనా సాధ్యమా?
చంద్రబాబు గారు రోజూ 4 నుంచి 6 గంటలు నిద్రకు కేటాయిస్తారు. వేకువనే నిద్రలేచి ఈత 30 నిమిషాలు, జిమ్ 30 నిమిషాలు,
యోగ 30 నిమిషాలపాటు క్రమం తప్పకుండా చేసే చంద్రబాబు నిత్యయవ్వన రహస్యం ఇంకా వేరే చెప్పాలా?
తిరుపతి ప్రచారంలో దాదాపు వారం రోజులు తిరిగారు.. ఒక్క సభలో అయినా చంద్రబాబుకి గొంతు పట్టిందా?
అలిసిపోయారా? ఆగిపోయారా? ఓపిక తగ్గిందా? ఆయన చుట్టూ వున్నవాళ్లలో చాలా మంది పడకేసేశారు.
ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం కొండ నడుచుకుంటూ ఎక్కి మళ్లీ కిందకు దిగారు..అలసిపోలేదు..సోలిపోలేదు
72 సంవత్సరంలో అడుగిడుతున్న మేరునగధీరుడి స్టామినా ఇది.
చంద్రబాబు గారు మీడియా సమావేశాలలో గంటలు గంటలు మాట్లాడతారు..అనేది జర్నలిస్టులు తమలో తాము మాట్లాడుకొనేది.
చంద్రబాబు గారి సమావేశం 3 గంటలు జరిగిందనుకోండి…అందులో ఆయన ఒక్కసారి కూడా లేవరు..నీరు కూడా తాగరు.. యూరినల్ కీ పోరు.
అదే సమావేశంలో వున్నవారు మాత్రం దిక్కులు చూస్తుంటారు.. నీటి కోసం, యూరినల్ వెళ్లడానికో.. ఓపిక నశించో..
చంద్రబాబు నేను చెప్పింది విన్నారు…నన్ను సలహా అడిగారు అని చాలా మంది చెబుతుంటారు.
నిజమే ఆయన సబ్జెక్ట్ తెలుసుకోండి అని అందరికీ సలహా ఇస్తారు..ఆ సబ్జెక్ట్ చిన్నపిల్లవాడి దగ్గర వున్నా వింటారు. తెలుసుకుంటారు.
ఆయన ఓ సమావేశంలో “నేను నిత్య విద్యార్థిని.. అనంత విజ్ఞానంలో తెలుసుకున్నది చాలా తక్కువ..
నేను పూర్తిగా నేర్చుకున్నప్పుడే నేను ఇతరులకు చెప్పగలను“ అని విద్యార్థులకు చెప్పారు.
చంద్రబాబుపై కోపం పెంచుకోవడానికి మీకు ఏ కారణమైనా దొరకొచ్చు.. చంద్రబాబుని ద్వేషించడానికి మీ దగ్గర ఏ సమీకరణాలైనా వుండొచ్చు.
ఆయన నుంచి మంచి గ్రహించడానికి ఏ కారణమూ అక్కర్లేదు… ఆయన క్రమశిక్షణని ఫాలో అవడానికి మీరు ఏ సామాజికవర్గమైనా కావొచ్చు..
చంద్రబాబుని ద్వేషించు..కానీ ఆయన మార్గాన్ని ఆచరించు..
నాయకుడివై తెలుగుజాతిని నడిపిస్తూ వందేళ్లు వర్థిల్లు చంద్రబాబునాయుడా!
AP SHOULD MERGE WITH BAY OF BENGAL