అమెరికాలోని హ్యూస్టన్లో ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదంపై ‘తానా’ మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ భార్య వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు వాలర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
వైద్య విద్యను అభ్యసిస్తున్న పెద్ద కుమార్తెను దసరాకు ఇంటికి తీసుకురావడానికి వాణీ, ఆమె చిన్న కుమార్తె వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న లెక్సస్ కారును షెవీ పికప్ ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరొకరిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
‘తానా’ ప్రస్తుత బోర్డు డైరక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొడాలికి ‘తానా’ తో బలమైన అనుబంధం ఉందని, ఆయన కుటుంబంలో జరిగిన దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ‘తానా’ మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి తెలిపారు