ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఉదయం 11:30 వరకు వెలువడిన ఫలితాల ట్రెండ్ చూస్తే ఓవరాల్ గా టీడీపీ 152 స్థానాల్లో లీడ్ లో ఉంది. అధికార పార్టీ వైసీపీ 23 స్థానాలలో మాత్రమే లీడ్ లో ఉంది. మొత్తం 152 స్థానాల్లో టీడీపీ 127 స్థానాల్లో, జనసేన 19 స్థానాల్లో, బిజెపి 6 స్థానాల్లో లీడ్ లో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాయలసీమను టీడీపీ కూటమి బద్దలు కొట్టింది.
సీమలో టిడిపి 40 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే లీడ్ లో కొనసాగుతోంది. ఇక, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలలో వైసీపీ ఖాతా తెరవలేదు. సీఎంతో పాటు వైసీపీ నేతలు అంతా ఆశలు పెట్టుకున్న రాయలసీమలో కూడా టీడీపీ ఘన విజయం సాధించే దిశగా దూసుకువెళ్లడంతో దాదాపుగా వైసీపీ ఘోర ఓటమి ఖాయమైందన్న టాక్ వస్తుంది. 23 సీట్లకే ప్రస్తుతానికి వైసీపీ లీడ్ ఉండటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. గత ఎన్నికల్లో దేవుడు స్క్రిప్ట్ 23 అంటూ టిడిపిని జగన్ ఎన్నోసార్లు ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయ్యి 23 స్థానాలు వైసీపీకి వచ్చేలా కనిపిస్తున్నాయని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.