ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు అవసరం లేదు. గిల్లి అనే కన్నడ మూవీతో కెరీర్ ప్రారంభించిన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. దాదాపు దశాబ్దం నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడింది. అలాగే ఇటీవల బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. ప్రొఫెషనల్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తన బ్రేకప్ స్టోరీని సైతం రివీల్ చేసింది. జాకీ భగ్నానీతో ప్రేమ, పెళ్లి కన్నా ముందే రకుల్ మరొక వ్యక్తితో లవ్ లో పడిందట. అయితే ఒక రోజు బాయ్‌ఫ్రెండ్ తో కలిసి రకుల్ రెస్టారెంట్ కి వెళ్లిందట. అక్కడ రకుల్ కోసం అతని ప్రియుడు ఫ్రైడ్ ఫుడ్ ను ఆర్డర్ చేయగా.. అది ఆమెకు అస్సలు నచ్చలేదు.
పైగా రకుల్ ఆర్డర్ చేసిన హెల్తీ ఫుడ్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ తక్కువ చేసి చూశాడట. దాంతో అతనికి రకుల్ బ్రేకప్ చెప్పేసిందట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రకుల్ స్వయంగా బయటపెట్టింది. `ఫుడ్ విషయంలో నాకంటూ కొన్ని సొంత అలవాట్లు ఉంటాయి. భోజనాన్ని, జీవన శైలిని పంచుకోలేని వ్యక్తి నాకెందుకు అనిపించింది. అందుకే బ్రేకప్ చెప్పేశాను. నేను ఆహారం విషయంలో చాలా కేర్ చూపిస్తాను. దాన్ని ఎంతో గౌరవిస్తాను` అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. ఇక రకుల్ కామెంట్స్ కు నెటిజన్లు షాకైపోతున్నారు. ఇంత వింతైన బ్రేకప్ స్టోరీ ఎప్పుడూ వినలేదని.. ఎవరైనా అంత చిన్న రీజన్ కు విడిపోతారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.