ఒక సమర్థుడు రాజుగా ఉంటే రాజ్యం పచ్చని పంటపొలాలతో సుభిక్షంగా ఉంటుంది….అదే ఒక అసమర్థుడు రాజుగా ఉంటే పచ్చటి పంటపొలాలు కూడా బీడు భూములుగా మారతాయి….అదే సమర్థుడు మళ్లీ రాజు అయితే ఆ బీడు భూములను సైతం పంటపొలాలుగా మార్చగలడు. ఆ రాజ్యం అమరావతి అయితే..ఆ అసమర్థ ముఖ్యమంత్రి జగన్…ఆ సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిని చేయాలన్న చంద్రబాబు కలను జగన్ ఛిద్రం చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే బీడువారిన అమరావతి చిగురుతొడిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు 2014-2019 మధ్యకాలంలో తలపెట్టిన అనేక ప్రాజెక్టులు ఇప్పుడు మళ్లీ పున:ప్రారంభం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమరావతికి
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తీపి కబురు చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటునకు సర్వే పూర్తయిందని అరుణ్ కుమార్ ప్రకటించారు ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం, నిధులు మంజూరు అయిన వెంటనే కొత్త రైల్వే లైన్ పనులు మొదలవుతాయని అన్నారు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రూ.21వేల కోట్ల రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని ఆయన చెప్పారు. బడ్జెట్ లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,151 కోట్లు కేటాయించామన్నారు.
ఏపీలో రూ.21 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 1,687 కిలోమీటర్ల మేర కొత్త, డబుల్, ట్రిపుల్ లైన్ పనులు ఉన్నాయని చెప్పారు. ఏపీలో 97 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఇమేజ్ వల్ల అమరావతితోపాటు ఏపీ డెవలప్ మెంట్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.