ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు ఇద్దరు లేదా ఒక్కరు సంతానానికే పరిమితం అవుతున్నారు. దీని కారణంగా దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించి జనాభా రేటు తగ్గుతూ వస్తోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే.. యువత సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఇది రానున్న రోజుల్లో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిల్లలను కనాలని పదే పదే చెబుతున్నారు. ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు అంటూ పిలుపునిస్తున్నారు.
జనాభా నియంత్రణపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న విజన్-2047లో జనాభా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారిని స్థానిక సంస్థల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక చంద్రబాబు మాటలను ఆదర్శంగా తీసుకున్న టీడీపీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏపీ జనాభాను పెంచడానికి వినూత్నరీతిలో ఓ క్రేజీ ఆఫర్ ప్రకటించారు.
ఇద్దరు సంతానంతో ఆపకుండా మూడవ కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే.. తన జీతం నుంచి రూ. 50 వేలు ఆ దంపతులకు చెల్లిస్తానని, అదే మగబిడ్డను కంటే ఆవు-దూడను కానుకగా ఇస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటన చేశారు. నా పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయని.. ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని, ఒకవేళ నా జీతం చాలకపోయినా సొంతంగా డబ్బు పెట్టుకుంటానని ఎంపీ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి స్పూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నానని కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది.
Amid the push of #AndhraPradehs CM #ChandrababuNaidu for more than 2 children, #Vizianagaram MP #KalisettyAppalanaidu announced that if a women gives birth to third child who is a girl, Rs 50,000 will be paid to her from his salary & if its a boy a cow will be handed over to her pic.twitter.com/Z2LBalTmTm
— Aneri Shah Yakkati (@tweet_aneri) March 10, 2025