ఏపీ సీఎం జగన్ తడబడ్డారు. పొటాటోలకు.. ఆనియన్స్‌కు ఆయన తేడా మరిచిపోయినట్టున్నారు. పొటాటో అంటే.. ఉల్లిగడ్డే కదా! అంటూ.. ఏకంగా ఐఏఎస్ అధికారులను ప్రశ్నించారు. దీంతో వారు బిత్తరపోయారు. ఏం జరిగిందంటే.. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఆర్థికంగా సాయం చేయకపోయినా.. వారిని ఓదార్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు.
ఈ సందర్భంగా వాకాడు మండలం బాలిరెడ్డిపల్లెలో ఏర్పాటు చేసిన సహాయక విబిరంలో తలదాచుకుంటున్న వరద బాధితులను ఆయన ఓదార్చారు. ఓ సమావేశం ఏర్పాటు చేసిన వారితో జగన్ మాట్లాడారు. ఆ సమయంలో వారికి తక్షణం అందిస్తున్న సాయం ఏంటనేది అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఒక కేటీ కందిపప్పు, పాతిక కేజీల బియ్యం, ఒక లీటరు పామాయిల్ అందిస్తున్నామన్నారు.
అదేసమయంలో ఒక కేజీ పొటాటో ఆనియన్లు ఇస్తున్నామని చెప్పారు. ఆ వెంటనే ఏమనుకున్నారో ఏమో.. ‘పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా!’ అంటూ పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. పొటాటో అంటే.. ఆనియన్ కాదని.. బంగాళా దుంపలని కలెక్టర్ చెప్పడంతో `ఆ.. ఆ.. బంగళా దుంపలు` అని సరిచేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా బంగాళా దుంపలు అని పలకకపోయే సరికి కలెక్టర్ దానిని సరిచేశారు. మొత్తానికి సీఎం నాలెడ్జ్‌పై అందరూ నవ్వుకున్నారు. ఇక, నెటిజన్లు, విపక్షాలుఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Potato ???? ని ఉల్లిగడ్డ ???? అంటారు ????????
మా షీయం షెప్తే అంతే ????????
ఏడ దొరికిన సంతరా ఇది pic.twitter.com/1vHHCQVi2d
— Venu M Popuri (@Venu4TDP) December 8, 2023
బంగాళాదుంపలకి ఉల్లిగడ్డ కి తేడా తెలీదు ఈ ముఖ్యమంత్రికి.. బాబు గారు స్టార్టింగ్ ఏ ర్యాగింగ్ మొదలెట్టారు ????
— బాబు కోసం (@trollycp) December 8, 2023