ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి. వరుసగా మూడు సార్లు ఆయ న విజయం దక్కించుకున్నారు. అభివృద్ధి పనులతో ఆయన ఇక్కడ దూకుడుగా ఉన్నారు. అయితే.. ఇ న్నాళ్లు ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న వారణాసి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుం ది. 19 ఏళ్ల యువతిని నిర్బంధించిన 23 మంది యువకులు.. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
అయితే.. ఇది ఒకే రోజు జరిగిన ఘటన కాదు. ఆమెను చాలారోజుల కిందటే నిర్బంధించి.. పదే పదే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు తిప్పారు. హుక్కా సెంటర్లు, హోటళ్లకు కూడా తిప్పుతూ.. అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై గత రెండు రోజులు గా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం కావడం.. పైగా బీజేపీ పాలిత కీలక రాష్ట్రం కావడంతో ఎవరూ దీనిని సీరియస్గా తీసుకోలేదు.
కానీ, బీబీసీ ఈ విషయాన్ని హైలెట్ చేసింది. తాజాగా శుక్రవారం వారణాసిలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనాన్ని రూపొందించి.. ప్రసారం చేసింది. ఈ విషయంపై స్పందించిన మోడీ.. తా ను వారణాసిలోకి వస్తూ వస్తూనే ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. విమానాశ్రయానికే.. డీజీపీ సదరు కలెక్ట ర్.. సబ్ కలెక్టర్లను పిలిపించుకుని ఏం జరిగిందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి 19 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు.
అంతేకాదు.. పారిపోయిన.. వారికోసం గాలిస్తున్నట్టు ప్రధానికి వివరించారు. ఈ సమయంలో జోక్యం చేసు కున్న ప్రధాని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందని ప్రశ్నించడం గమనార్హం. అయితే.. ఘటన జరిగి ఇన్ని రోజులు అయిన తర్వాత.. ప్రధాని ఇప్పుడు స్పందించడం పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అసలు ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం.. దారుణం జరిగాక.. చర్యలు తీసుకోవడంలోనూ తాత్సారం చేస్తోందని ఎస్పీ నేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.