తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఎన్ఆర్ఐ ల సహాయ సహకారాలతో ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను చేస్తుంది.
ప్రతిభ ఉన్న వారిని పై చదువులకోసం విదేశాలకు ప్రోత్సహించడమే కాకుండా అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్న ఎన్ఆర్ఐ టీడీపీ సెల్.
పలికే శ్రీనివాసరావు(వాసు) గత 25 సంవత్సరమల నుండి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నారు.
అతని కుమార్తె పలికే సంధ్య టీడీపీ సహకారంతో 6వ తరగతి నుండి ఫార్మసీ వరకు మంచి మార్కులతో పూర్తిచేసింది.
చంద్రబాబు స్పూర్తితో ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సంధ్య ను విదేశాల్లో మాస్టర్స్ చదివించడానికి పూనుకుని దానికి అవసరం అయిన IELTS పరీక్ష నుండి USA యూనివర్సిటీలకు అప్లికేషన్స్ పంపడం, వీసా ఫార్మాలిటీస్, ఎడ్యుకేషన్ లోన్ 40 లక్షల రూపాయలు శాంక్షన్ వరకు అన్ని దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది.
NRI TDP శ్రీహరి అయినంపూడి USA లో MS కోసం వెళ్తున్నపేద విద్యార్థినికి ₹1.75 లక్షల టిక్కెట్టు సహాయం అందించారు. నక్కా ఆనందబాబు, టీడీ జనార్దన్, డాక్టర్ రవి వేమూరు,బుచ్చి రామ్ ప్రసాద్ చేతుల ద్వారా అందించారు.
దీనితో పాటు అక్కడికి వెళ్లిన తరువాత తన ఖర్చులకై పార్ట్ టైమ్ జాబ్ కూడా ఇప్పిస్తాం అని బోస్టన్ లో ఉన్న తేలప్రోలు సూర్య ముందుకు వచ్చి హామీ కూడా ఇచ్చారు.
గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పలువురు విద్యార్థులకు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ద్వారా అయినంపూడి శ్రీహరి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
వీరు చేస్తున్నసేవను ఈ టిక్కెట్ అందించిన నాయకులతో పాటు ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అయినంపూడి శ్రీహరిని అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టిడిపి సెల్ తెలుగుదేశం కార్యకర్తలకు మరియు వారి పిల్లలకు ఎన్నో రకాల సేవలలో భాగంగా వివిధ రకాలైనటువంటి కోర్సుల్లో ట్రైనింగు, తరువాత వారికి ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆయా దేశాలలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ ల సహకారంతో ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న కార్యకర్తల పిల్లలకు సరైన అవగాహన కల్పించి మంచి యూనివర్సిటీలో సీటు, స్టూడెంట్ లోను ప్రోసెసింగ్, వీసా ప్రోసెస్ లో గైడెన్స్ ఇస్తూ వారిని సరైన మార్గంలో వెళ్లే విధంగా సూచనలు మరియు సహాయ సహకారాలు, అక్కడ నివసిస్తున్న తెలుగుదేశం కార్యకర్త ఎన్ఆర్ఐ లకు అవసరమైన డాక్యుమెంటేషన్ హెల్ప్, న్యాయ సంబంధిత సహాయ సహకారాలతో పాటు మరెన్నో సేవలు అందిస్తున్నట్లు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ అధినేత డాక్టర్ రవి వేమూరి ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియచేశారు.
అదే విధంగా సహాయ సహకారాలు కావలసినవారు ఈ ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కు సంబంధించిన వెబ్సైటు www.nritdp.com ద్వారా కానీ లేదా తెలుగుదేశం క్యాడర్ లోకల్ లీడర్స్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అని తెలిపారు.