సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత, సింగర్ చిన్మయి శ్రీపాదల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ తో పాటు ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. అందుకే, వీరిద్దరూ తరచుగా కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో గతంలో కనిపిస్తుండేవి. కానీ, కొంతకాలంగా వీరిద్దరూ కలుసుకోవడం లేదని, వారి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారానికి తగ్గట్లుగానే వీరిద్దరూ ఈ మధ్యకాలంలో కలిసిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలోలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి ఆ విషయంపై స్పందించింది. తనకు సమంత మంచి ఫ్రెండ్ అని, తామిద్దరం కలుస్తున్నామో లేదో అనే విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
సమంత వల్లే తనకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఏర్పడిందని, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సమంతతో తన ప్రయాణం ముగిసిందనుకుంటున్నానని చిన్మయి చెప్పింది. సమంత తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోందని, ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశం రాదేమోనని చెప్పింది. తామిద్దరం కలిసినప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టనంత మాత్రాన తాము విడిపోయినట్లు కాదని, తన పర్సనల్ లైఫ్ ని అందరితో షేర్ చేసుకోవడం తనకు నచ్చదని సమాధానమిచ్చింది. తాము కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పబోమని, ఇంట్లోనే కలుస్తుంటామని చెప్పుకొచ్చింది.
తన భర్త రాహుల్, సామ్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది చిన్మయి. అయితే, గతంలో వీరిద్దరి ఫొటోలు, రాహుల్ తో పాటు సామ్, చిన్మయి దిగిన ఫొటోలు ఎప్పటికపుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చేవని, అప్పుడు ఫొటోలు షేర్ చేసిన చిన్మయి ఇప్పుడెందుకు చేయడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం తెలుగులో ‘ఖుషి’, ‘యశోద’.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.