టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేసిన విధానంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తోపాటు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై జాతీయ స్థాయిలో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు.
జాతీయ స్థాయి నేతలను కలిసిన లోకేష్ పలు జాతీయ ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో కూడా మచ్చలేని నేతగా గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును తుడిచి పెట్టేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అందుకే, జగన్ కక్ష సాధింపు రాజకీయాలను ఎండగట్టేందుకు, జగన్ అసలు రంగు గురించి దేశ ప్రజలకు తెలియజేసేందుకు ఢిల్లీ వచ్చానని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు.
జాతీయ మీడియాతో నారా లోకేష్ అన్న మాటలు యథాతధంగా…
– ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైలుకు పంపారు
– దేశ ప్రజలు అందరికీ వాస్తవాలు తెలియజెప్పేందుకే నేను ఢిల్లీ వచ్చా
– చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని అందరిన అభ్యర్థిస్తున్నా
– అవినీతి నిరోధక చట్ట నిబంధనలను ఉల్లంఘించి అరెస్టు చేశారు
– 17(ఏ) నిబంధన ప్రకారం అరెస్టుకు ముందస్తు అనుమతి తప్పనిసరి
– 17(ఏ) నిబంధన పాటించనందున చంద్రబాబు అరెస్టు చెల్లదు
– స్కిల్ కేసు దర్యాప్తులో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
– సీమెన్స్.. 6 రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది
– చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులకు డబ్బు చేరినట్లు ఆధారాలు లేవు –
ఒప్పందం చేసింది.. నిధులు విడుదల చేసింది.. ప్రేమ చంద్రారెడ్డి, అజేయ కల్లం
– ఎఫ్ఐఆర్ లో ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం పేర్లు ఎందుకు లేవు?
– జగన్ ప్రభుత్వ సలహాదారుగా ప్రస్తుతం అజేయ కల్లం ఉన్నారు
– ఐఏఎస్ ల బృందం గుజరాత్ వెళ్లి ప్రాజెక్టును అధ్యయనం చేసింది
– అధికారుల సిఫారసు మేరకే ఏపీలో నిధుల విడుదల జరిగింది
– మా పార్టీకి చెందిన వేలమంది నేతలు జైళ్లలో ఉన్నారు
– నాపై కూడా హత్యాయత్నం సహా 22 తప్పుడు కేసులు పెట్టారు
– పీపీఏలు రద్దు చేశారు.. పరిశ్రమలను ఏపీ నుంచి తరిమేశారు
– మాకు వస్తున్న ప్రజాస్పందన చూసే ప్రతీకార రాజకీయాలు
– సమర్థంగా, వేగంగా పనిచేయడం తప్పని సీఐడీ అనడం సరికాదు
– పవన్ కల్యాణ్ కూడా జగన్ ప్రభుత్వ బాధితుడే : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్