ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ జాబితాలో జనసేన నుంచి కొణిదెల నాగబాబు , టీడీపీ నుంచి బీద రవీంద్ర, తిరుమల నాయుడు, గ్రీష్మ ప్రసాద్, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఉన్నారు. వీరికి పోటీగా ఎవరూ నిలబడకపోవడంతో.. ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన నాగబాబు శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో జనసైనికులు, మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అలాగే త్వరలోనే చంద్రబాబు అధ్యక్షన మెగా బ్రదర్ మంత్రి పదవి కూడా చేపట్టబోతున్నారు. అయితే ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబును తీసుకుంటే.. శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన నయా రికార్డ్ సృష్టించినట్లు అవుతుంది. ఎందుకంటే, కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు మండలి నుంచి ఎవ్వరిని క్యాబినెట్ లోకి తీసుకోలేదు. ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడుకి కూడా ఆ అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఆ అరుదైన ఛాన్స్ నాగబాబుకే దక్కబోతోంది.
కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో నాగబాబు ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. `ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా అభినందనలు. నా బాధ్యతను మరింత పెంచిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు` అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు
-నా బాధ్యతను పెంచిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు
-నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు-మీ నాగబాబు.@JanaSenaParty @PawanKalyan @ncbn pic.twitter.com/vHdl1KEkfs
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 14, 2025