పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ పెద్దలు అంతర్మథనంలో పడ్డారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగాల్ ఎన్నికలలో దీదీ దెబ్బకు మోదీ అప్రమత్తమయ్యారని, రాబోయే సార్వత్రిక ఎన్నికలకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించడం ప్రారంభించారని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మోదీ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే మోదీ త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూపీ పర్యటనలో ఉన్న మోదీ…హస్తినకు రాగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని అనుకుంటున్నారు. కొత్త కేబినెట్ లోని సభ్యులను మోదీ, షాలు ఆల్రెడీ డిసైడ్ చేశారని, జులై మొదటి వారంలోనే కేబినెట్ విస్తరించనున్నారని తెలుస్తోంది. మొత్తం 24 మందికి తొలిసారిగా కేబినెట్ లో చోటు దక్కనుందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ దాదాపుగా ఫైనల్ చేసిన పేర్లు ఇవేనంటూ ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా చక్కర్లు కొడుతోన్న జాబితాలో తెలుగు ఎంపీల పేర్లు లేవు. కానీ, తుది జాబితాలో ఏపీ బీజేపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ లలో ఒకరికి బెర్త్ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.
మోదీ కొత్త కేబినెట్…ఊహాజనిత జాబితా
1. శర్వానంద సోనోవాలా (అసోం)
2. జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్)
3. సుశీల్ మోదీ (బిహార్)
4.అనుప్రియా పటేల్ (యూపీ)
5. నారాయణ రాణే (మహారాష్ట్ర)
6. హీనా గావిత్ (మహారాష్ట్ర)
7.మనోజ్ తివారీ (ఢిల్లీ)
8. శంతనూ ఠాకూర్ (బెంగాల్)
9.దిలీప్ ఘోష్ (బెంగాల్)
10. లల్లన్ సింగ్ (బిహార్)
11. ఆర్.సీ.పీ. సింగ్ (బిహార్)
12. జామ్యాంగ్ నామ్గ్యాల్ (లద్దాఖ్)
13. సయ్యద్ జఫర్ ఇస్లామ్ (యూపీ)
14. ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర)
15. అశ్వనీ వైష్ణవ్ (రాజస్థాన్)
16. లాకెట్ ఛటర్జీ (బెంగాల్)
17. రాహుల్ కాస్వాన్ (రాజస్థాన్)
18. సంతోశ్ కుశ్వాహ (బిహార్)
19. సునీతా దుగ్గల్ (హర్యానా)