ప్రస్తుతం ప్రధాని మోదీ చేపట్టబోతోన్న కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ విస్తరణలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని టాక్ వస్తోంది. ఇక, మోదీ తాజా కేబినెట్ లో మొత్తం 43 మందికి చోటు దక్కిందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. దాదాపుగా ఈ 43 మంది జాబితానే ఫైనల్ అయ్యే అవకాశముందని, కొద్ది సేపట్లోొ అధికారికంగా ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
అయితే, ఈ జాబితాలో బీజేపీ కీలక నేత, తెలుగు తేజం, ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కీలక మంత్రిత్వ శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డికి ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ లో కీలక పదవి దక్కించుకునే అవకాశమున్న కొందరు నేతలు ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. వారిలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. దీంంతో, కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డికి పదోన్నతి దక్కే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కేంద్ర కార్మికశాఖ మంత్రి(స్వతంత్ర్య హోదా)గా ఉన్న సంతోష్ గాంగ్వార్ తన పదవికి రాజీనామా చేయడంతో కార్మిక శాఖ కిషన్ రెడ్డికి దక్కే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిథ్యం వహించిన బండారు దత్తాత్రేయకు స్వతంత్ర్య హోదాతో కార్మిక శాఖలోనే ఉన్నారు. దీంతో మరోసారి ఆ శాఖ తెలంగాణకే వస్తుందా? అన్న ప్రచారం మొదలైంది.
మోదీ కేబినెట్ అంచనా జాబితా
1. నారాయణ రాణే 2. సర్బానంద్ సోనోవాలా 3. డాక్టర్ వీరేంద్ర కుమార్ 4. జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్ర ప్రసాద్ సింగ్ 6. అశ్వనీ వైష్ణవ్ 7. పశుపతి కుమార్ పారస్ 8. కిరణ్ రిజిజు 9. రాజ్ కుమార్ సింగ్ 10. హర్దీప్ సింగ్ పూరీ 11. మన్సుఖ్ మాండవ్య 12. భూపేందర్ యాదవ్ 13. పురుషోత్తం రూపాలా 14. కిషన్ రెడ్డి 15. అనురాగ్ ఠాకూర్ 16. పంకజ్ చౌధురి 17. అనుప్రియా పటేల్ 18. సత్యపాల్ సింగ్ బాఘేల్ 19. రాజీవ్ చంద్రశేఖర్ 20. శోభా కరంద్లాజే 21. భానుప్రతాప్ సింగ్ వర్మ 22. దర్శన విక్రమ్ జర్దోశ్ 23. మీనాక్షి లేఖీ 24. అన్నపూర్ణా దేవి 25. నారాయణ స్వామి 26. కౌశల్ కిశోర్ 27. అజయ్ భట్ 28. బి.ఎల్. వర్మ 29. అజయ్ కుమార్ 30. చౌహాన్ దేవూసింగ్ 31. భగవంత్ ఖూబా 32. కపిల్ మోరేశ్వర్ పాటిల్ 33. ప్రతిమా భౌమిక్ 34. భగవత్ కృష్ణారావు 35. సుభాశ్ సర్కార్ 36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్ 37. భారతీ పవార్ 38. విశ్వేశ్వర్ తుడు 39. శంతనూ ఠాకూర్ 40. మహేంద్ర భాయ్ 41. జాన్ బర్లా 42. మురుగన్ 43. నితీశ్ ప్రామాణిక్