కొన్ని పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలా చిన్న విషయాలకు పదవులు పోవడం అనేది అరుదుగా జరిగే వ్యవహారం. ఇటీవలే దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు చక్కా నాగ వెంకట వరలక్ష్మి కార్లో పోలీసు అక్రమ మద్యం పట్టుకున్నారు. ఇది సంచలనం అయ్యింది. దీంతో తాజాగా ఆమె తన పదవికి రాజీనామా చేసింది.
అయితే, తాను నైతిక బాధ్యతతో పదవికి రాజీనామా చేస్తున్నాను అని, తప్పు మాత్రం తన డ్రైవరుదే అని ఆమె పేర్కొనడం గమనార్హం. శ్రీ కనకదుర్గ గుడి ఆలయ బోర్డు ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో సురేష్ కు ఆమె రాజీనామా పత్రాన్ని పంపించారు.
మద్యం రవాణా మేడ్ వెంకటనాగలక్ష్మికి తెలియదు అని డ్రైవరు శివ కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం నలుగురు ఈ కేసులు నిందితులుగా నమోదయ్యారు.
ఇదిలా ఉండగా ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించారు.