సరిగమపదనిస…. అరె కరో కరో జర జల్సా…. జల్సా…. ఈ పాట వినగానే ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం టైటిల్ సాంగ్ గుర్తుకొచ్చిందా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ పాటను పదే పదే విన్న ఏపీ మాజీ సీఎం జగన్ ప్రజాధనాన్ని తన జల్సాలకు, తన పార్టీ నేతల అవసరాలకు వాడిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. లోటస్ పాండ్ లో సీసీ కెమెరాల ఖర్చు మొదలు ఆఖరికి సజ్జల ఇంట్లో టీ కప్పులు కొనేందుకు డబ్బులు ఖర్చు పెట్టడం షాకింగ్ గా మారింది.
పైగా ఆ దుబారా ఖర్చుకు, జగన్ జల్సాలకు అధికారిక కలరింగ్ ఇస్తూ రకరకాల జీవోలు జారీ చేయడం కొసమెరుపు. ఓ పక్క ఆ పాటలో నటించిన పవన్ మాత్రం జగన్ దుబారా దెబ్బకు తన జీతాన్ని కూడా వదులుకుంటే…జగన్ మాత్రం పవన్ పాటకు ఇన్ స్పైర్ అయి జల్సాలకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడిన వైనంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జగన్ జల్సాల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జీఓ నెంబర్: 160
లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటికి సిసి కెమెరాల ఖర్చు రూ.12.50 లక్షలు
లోటస్ పాండ్ లో బాత్ రూమ్ కోసం రూ.12 లక్షలు…
జీఓ నెంబర్ : 279
తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ “వ్యూ కట్టర్” కోసం రూ:3.25 కోట్లు….
జీవో నెంబర్ : 139
తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి : రూ.8.50 లక్షలు
మన ఇంట్లో పనికి అయితే మహా అయితే రోజుకి వెయ్యి తీసుకుంటున్నారు ఇక్కడ లక్షలు ఇచ్చేసారు….
జీవో నెంబర్ : 146
తాడేపల్లి ప్యాలెస్ లో ట్రాన్స్ ఫార్మర్ కోసం : రూ.97 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో సిసిటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ.1.25 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ లో ఏసి పెట్టటానికి రూ.80 లక్షలు
320 KVA DG సెట్ కోసం రూ.39 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో లైట్ లు పెట్టటానికి రూ.11.50 లక్షలు
ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో బిగించటానికి రూ.11 లక్షలు
జీవో నెంబర్ : 132
జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయటానికి, 1 కిమీ రోడ్డుకి రూ.5 కోట్లు…
జీవో నెంబర్ : 308
జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్ కొనటానికి రూ.39 లక్షలు…
జీవో నెంబర్: 133
జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయటానికి రూ.40 లక్షలు…
తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టటానికి రూ.75 లక్షలు
తాడేపల్లి ప్యాలెస్ లో దొడ్లు కట్టటానికి రూ.43.50 లక్షలు
జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ గేట్స్ శాస్వతంగా పెట్టటానికి రూ.31 లక్షలు….
జీవో నెంబర్: 329
తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్ లు పెట్టటానికి రూ.22.50 లక్షలు….
జీవో నెంబర్: 330
తాడేపల్లి ప్యాలెస్ లో కిటికీలు పెట్టటానికి రూ.73 లక్షలు…
జీవో నెంబర్: 329
జగన్ ప్రమాణస్వీకారానికి ఎలెక్ట్రికల్ లైటింగ్ పెట్టటం కోసం రూ.22 లక్షలు
జీవో నెంబర్: 1737
జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయటానికి జెరెసులాం వెళ్ళినందుకు : రూ.22.52 లక్షలు….
జీవో నెంబర్: 254
జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనులు కోసం ఖర్చు రూ.22.50 లక్షలు….
జీవో నెంబర్ : 1609
జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా…
జీవో నెంబర్ : 1742
బూడి ముత్యాల నాయుడు ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా…
జీవో నెంబర్: 1741
దాడిశెట్టి రాజా ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా…
జీవో నెంబర్ : 1743
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా….
సాక్షిలో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు…
సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవటానికి రూ.1.50 లక్షలు సజ్జలకు ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవటానికి రూ.3 లక్షలు…