వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు ఈ రోజు వెలువడనున్న నేపథ్యంలో తెలుగు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
జగన్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ‘బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత’ అంటూ వేసిన కోర్టు ధిక్కార వార్తపై కూడా వాదనలు ముగిశాయి. సాక్షి వార్త జగన్ మీడియా అధికారిక ట్విటర్ హ్యాండిల్ నిర్వహించే ఉద్యోగి తప్పిదమని ఆ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు వివరించారు. ఈ రెడ్డి లాయరు ఎవరో కాదు మొన్న జగన్ జనం డబ్బును 90 లక్షలు ఉదారంగా పంచిన లాయరు ఇతనే.
ఇక నేడు సాక్షి వార్త తీర్పుతో పాటు జగన్ బెయిల్ తీర్పు, విజయసాయిరెడ్డి బెయిలు తీర్పు కూడా రానున్నాయి. .
ఇదిలా ఉండగా.. జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్య, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా తదితర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని కోర్టును సీబీఐ కోరింది.
మొత్తానికి జగన్ బెయిలు రద్దు కావద్దని వైసీపీయే కాదు, తెలుగుదేశం కూడా కోరుకుంటోంది. ఎందుకంటే జగన్ అధికారంలో ఉంటే చాలు తమ గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది.