సాదాసీదా ప్రజలు కక్కుర్తి పడ్డారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. దేశంలోనే అత్యంత విలువైన క్యాడర్ గా చెప్పుకునే ఐపీఎస్ అధికారిగా వ్యవహరిస్తూ.. ఒక సీనియర్ ఐఏఎస్ ను మస్కా కొట్టేసేందుకు బరితెగించిన వైనాన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అసలేం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పని చేసిన భన్వర్ లాల్ 2017లో రిటైర్ కావటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత.. ఎన్నికల సంఘానికి ఆయన అధికారిగా వ్యవహరించటం తెలిసిందే.అయితే.. భన్వర్ లాల్ కు జూబ్లీహిల్స్ లోని ఒక బిల్డింగ్ ఉంది. దీన్ని అద్దెకు సాంబశివరావు అనే వ్యక్తితో 2014లో అద్దె ఒప్పందం జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం మొత్తం ఐదేళ్లకు ఒప్పందం జరిగింది. అయితే..2019 నాటికి తొలుత చేసుకున్న కాంట్రాక్టు హడావుడిగా ఉందని చెబుతన్నారు.
2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెర మీదకు వచ్చాయి. ఈ డాక్యుమెంట్ల సారాంశం ఏమంటే..సదరుఆస్తుల ఒరిజినల్ తరహాలో నకిలీ పత్రాలు సమర్పించినట్లుగా గుర్తించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నకిలీ పత్రాల్ని తయారు చేసిన ఐపీఎస్ అధికారి సాంబశివరావు.. తాను అద్దెకు ఉండే ఇంటిని తన సొంతమన్నట్లుగా పత్రాలు తయారు చేసిన వైనంపై భన్వర్ లాల్ ఫ్యామిలీ రియాక్టు అయ్యింది.
2019లో సాంబశివరావు స్థానంలో ఐపీఎస్ నవీన్ కుమార్ రావటం.. నకిలీ పత్రాలతో తాము అద్దెకు ఇచ్చిన ఇంటిని సొంతం చేసుకుంటున్న వైనం షాకింగ్ గా మారింది. దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. ఫోకస్ చేసిన ఖాకీలు కీలక అంశాల్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. భన్వర్ లాల్ ఆరోపణల నేపథ్యంలో సీసీ ఎస్ పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవన్నీ ఫేక్ గా తేల్చారు. దీంతో డిసెంబరు 22న సాంబశివరావును.. ఆయన భార్య రూపా డింపుల్ ను అరెస్టు చేశారు. ఈ మొత్తం విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్ అప్పటి నుంచి ఎవరికి అందుబాటులోని రాకుండా వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
గత ఆరేళ్లుగా పోలీసు అకాడమీలోవిధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ ఇలాంటి తెలివితేటల్నిప్రదర్శించటాన్ని జీర్నించుకోలేకపోతున్నారు. దీంతో.. భన్వర్ లాల్ సతీమణి సీసీఎస్ పోలీసులకుకంప్లైంట్ ఇవ్వగా.. అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. తనను టార్గెట్ చేసి కేసు పెట్టినట్లుగానవీన్ కుమార్ ఆరోపిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ వివాదంలోకి పోలీసులు కలుగజేసుకుంటున్నారని పేర్కొన్నారు. మొత్తంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంటిని ఒక ఐపీఎస్ అధికారి అద్దెకు తీసుకొని.. ఇలా చేయటమా? అన్న విస్మయానికి గురవుతున్నారు.