దెందులూరు మాజీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ టీడీపీ నాయకుడు.. చింతమనేని ప్రభాకర్.. మాట కరుకుగా ఉన్నా.. మనసు మాత్రం మెరుపు మాదిరిగా ఉంటుందని అంటారు ఆయన అభిమానులు. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా.. ఉత్తచేతులతో తిరిగి రారనే పేరు కూడా ఉంది. ఇక, ఉదయం నుంచి రాత్రి వరకు.. టీలు, కాఫీలు, టిఫిన్స్.. బోజనాలు ఇలా ఆయన ఇంట్లో నిత్యం ఏదో సంబరం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎంతో మంది వచ్చిపోయే వారితో తీర్థ క్షేత్రాన్ని తలపిస్తుంది.
ఇక, వ్యక్తిగతంగా చింతమనేనిని చూస్తే..ఆయన పైకి ఎంతో కటువుగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ, అంత ర్గతం చూస్తే ఆయన మనసు మాత్రం వెన్న అని చెబుతారు. చిన్నపాటి సెంటిమెంట్‌కే ఆయన లొంగిపో తారు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ ముందుంటారు. గతంలో ఎంతో మంది చింతమనేని సాయం పొందిన వారే. ఇప్పటికీ ఆయన చేతి సాయం అందుతున్నవారే ఉన్నారు. సరే.. ఇదంతా తన నియోజకవర్గానికి సంబంధించిన విషయం కాబట్టి.. అలా చేశారని అనుకున్నా.. నియోజకవర్గంతో ఎలాం టి సంబంధం లేకపోయినా.. ప్రజలకుమేలు చేయడంలో చింతమనేని ఎప్పుడూ ముందే ఉంటారు.
తాజాగా ఆయన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం ఇంటింటికీ తిరుగుతున్నారు. `బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తారస పడిన దళిత కుటుంబం విషయంలో వారు పడుతున్న ఇబ్బందులు చూసి.. చింతమనేని మనసు పరిచారు. అప్పటికప్పుడే.. అక్కడికక్కడే.. వారికి సాయం ప్రకటించారు. దీంతో చింతమనేని సాయం.. ఆయన చూపించే ఆదరణ వంటివి చర్చకు వస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం అమ్మ పాలెం పంచాయితీ అంజలిపురంలో బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో చింతమనేని ఇంటింటికీ తిరుగుతు.. ఓటర్లను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధంలేని ఓ కుటుంబం. బతుకుదెరువు కోసం వచ్చి.. రోడ్డు పక్కన తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంది. వీరుదళితులు. మేకల పెంపకమే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని.. వారి వద్ద ఉన్న మేకల వివరాలు తెలుసుకున్నారు.
కేవలం ఈ కుటుంబం దగ్గర 10 మేకలే ఉన్నాయని తెలియడంతో ఆయన మనసు కరిగిపోయింది. `పది మేకలతో ఇంతమంది బతుకుతున్నారా?` అని ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే 50 మేకలు ఇస్తానని, అవి కూడా చూడి మేకలు ఇస్తానని వాగ్దానం చేశారు. తెల్లవారగానే వస్తే.. చూడి మేకలు పంపిస్తానన్నారు. నిజానికి ఎవరైనా సొంత నియోజకవర్గం ప్రజలకు చేయడం తెలిసిందే. కానీ, సాయం చేయడంలో తన మన తేడా లేకుండా.. చింతమనేని చేస్తున్న సాయం నభూతో.. అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
`50 మేకలు ఎంత లేదన్నా.. రెండున్నర లక్షలకు పైగానే ఉంటాయి. ఇంత సాయం చేయాలంటే ఎంతో మనసు ఉండాలి. పైగా.. దళిత వ్యతిరేకి అంటూ.. అధికార పార్టీ నాయకులు.. ఈయనపై ముద్ర వేస్తారు. వాస్తవంగా అలా ముద్రవేసే నాయకులు అదే దళితుకలు కించిత్ సాయం కూడా చేయరు. దళితులకు ఏం కావాలనా.. తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా.. కష్టాల్లో ఉన్నారని తెలిసి..దళితులకు చేసిన సాయం చింతమనేని మనసు ఎలాంటి దో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే` ..!