ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ఏపీలో కుల చిచ్చు రేపింది. రాయలసీమలో మాధవ్ సామాజిక వర్గం కురబ వర్సెస్ కమ్మ సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనంతపురంలో చంద్రబాబు, లోకేష్ బ్యానర్లతో కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కురబల ర్యాలీ జరిగింది. తమ కులాన్ని గోరంట్ల కించపరిచారంటూ కమ్మవర్గం కదిరిలో ర్యాలీ చేసింది. దాంతోపాుట, అంతేకాదు అనంతపురంలో గోరంట్ల ఇంటిని ముట్టడిస్తామన్న కమ్మ సామాజిక వర్గం హెచ్చరికలతో పోలీసులు రంగంలోకి దిగారు.
అనంతపురంలో గోరంట్లకు వ్యతిరేకంగా అంబేద్కర్ సర్కిల్లో కమ్మ సామాజికవర్గం తరఫున నిరసన ర్యాలీ జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను గోరంట్ల కులంపేరుతో అవమానించారని, 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని కమ్మ కులస్థులు అల్టిమేటమ్ ఇచ్చారు. లేకుంటే గోరంట్లను అనంతపురంలోకి రానివ్వబోమని హెచ్చరించారు. ఇక, బెజవాడలో ప్రెస్ మీట్ పెట్టిమరీ గోరంట్లను కమ్మ సామాజిక వర్గ నేతలు హెచ్చరించారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గోరంట్ల ఇల్లు దాటి బైటికి రాలేదని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురంలో మొదలైన ఈ కుల చిచ్చు మెల్లగా ఏపీ వ్యాప్తంగా పాకేలా కనిపిస్తోంది.
దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ కుల చిచ్చుపై కొన్ని మీడియా ఛానెళ్లు ప్రసారం చేసిన కథనాలు చర్చనీయాంశమయ్యాయి. న్యూడ్ వీడియోతో అడ్డంగా దొరికినా నిజాన్ని సమాధి చేస్తూ జగన్ స్క్రిప్టుని ఫాలో అవుతూ కుల రాజకీయాలకు ఆజ్యం పొసే సాక్షి కి మీకు తేడా ఏంటి? అంటూ టీవీ9, ఎన్టీవీలను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో ప్రదర్శనతో జాతీయ స్థాయిలో వైసీపీని ఛీ కొడుతున్నా, ఇప్పటికే అతడిపై రేప్ కేసు ఉన్నా, ఇంకా ఆ ఎంపీని పార్టీలోనే కొనసాగించటం మహిళలను కించపరచడమేనని విమర్శలు వస్తున్నాయి.
మహిళలపై వేధింపుల్లో వైసీపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని ట్రోలింగ్ జరుగుతోంది. గోరింటాకు.కామాంధులని కాపాడటానికి కులాన్ని వాడుకుంటున్న జగన్ రెడ్డి అంటూ ట్రోల్ చేస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అంటే ప్రజలు ఏదో అనుకున్నారని, రసికుడు, బట్టలు విప్పి చూపించేంత ఉత్సాహం ఉన్నవాడని జగన్ రెడ్డి చెప్పలేదని సెటైర్లు వేస్తున్నారు.