ఎంతో మందిపై ఎన్నో విమర్శలు వచ్చినా కరోనా వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై వేగంగా స్పందించని కేసీఆర్ ఈటెలపై మాత్రం రాకెట్ వేగంతో చర్యలు తీసుకున్నాడు. దీనిపై ఈటెల చాలా కూల్ గా స్పందించారు. ‘‘కేసీఆర్ “ప్రజానాయకులని, ఉద్యమకారులని,మేధావులని” ఎలా ఖతం చేస్తాడో నాకు బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.
కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న గంటల వ్యవధిలోనే బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్… ఈసారి కేసీఆర్ పై నేరుగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలు వింటే చాలు కేసీఆర్ అక్రమాలు అందరికీ అర్థమైపోతాయి.
.
1. మీతో 19 ఏళ్లు కలిసి రాజకీయ ప్రయాణం చేశాను, మీ కుట్ర కుతంత్రాలు ఎట్లా ఉంటాయో నాకటే ఎవరికీ ఎక్కువగా తెలియదు. తడి గుడ్డ తో గొంతుకోసే రకమని ముందే పసిగట్టా. ఇష్టం లేకున్నా ఓపికతో ఎన్నో ఏళ్ళు గడిపా.
2. 35ఏళ్ళ క్రితం కోళ్ళ వ్యాపారాలు పెట్టాను, అండ్ల పని చేస్తూ ఎంతో కష్టపడి ఎదిగాను. మీ కుటుంబం లా నయీం ఆస్థులు, హైదరాబాద్ భూముల అక్రమ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూములని బెనామీల ద్వారా కార్పోరేట్ కంపనీలకు అమ్మించడం, వాటిని ప్రభుత్వ పరంగా సక్రమం చేస్తూ… వేల కోట్లు సంపాదించానా?
3. యాదగిరి గుట్ట కై 1000 కోట్లు కెటాయించేదానికంటే 2 నెలల ముందే యాదాద్రి చుట్టూ వేల ఎకరాలు పేదల వద్ద లక్షకు ఎకరం కొని ఈ రోజు కోట్ల కు ఎకరం అమ్ముకున్న మీ కుటుంబం, బంధు వర్గం లా ఎదిగానా? ఇది ఎంత మోసం? పేద ప్రజల సంపద దోపిడీ దేశద్రోహ చర్య తో సమానం.
4.వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మై హోం రామేశ్వర్ రావు ఆక్రమిస్తే చర్యలేవి? నీ బెనామి అనే కదా ఏమి చేయడం లేదు?
5. వందల కోట్ల విలువైన అక్రమ (111 ) 25 ఎకరాల జన్వాడ ఫార్మ్ హౌస్ నీ కొడుకు ఎట్లా సంపాదించాడు?
6. కీసర, కొంపల్లి చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు నీ కుటుంబ-బంధు బెనామీల చేతిలోకి ఎట్లా పోయింది?
7. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్షల కోట్ల విలువైన స్థలాలు నీ కుటుంబ బంధు బెనామి వర్గ చేతిలోకి ఎట్లా వచ్చింది?
8. 20 ఏండ్లు గా అక్కడే వ్యాపారం చేస్తున్న నన్ను ముఖ్యమంత్రి పిలిపించి ఎందుకు వివరణ అడగలేదు? మంత్రి స్థాయిలో ఉన్న నన్ను వివరణ కోరాల్సిన అవసరం లేదా? తన ఇష్టమున్నట్లు చేయడానికి ఇదేమన్నా తన కుటుంబ వ్యహారమా?
9. నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి అస్సైన్డ్ భూమిని కొలవాలి. ఇప్పటివరకు గ్రామంలో ఎవరికైనా అలా నోటీసులిచ్చారా?
10. భూముల సర్వేకు ఎమ్మార్వో రావాలి కదా.. కలెక్టర్ ను ఎందుకు పంపించారు?
నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసుల్ని పెట్టే అవసం ఏమొచ్చిందో చెప్పండి?
11. నయీం ముఠా నన్ను చంపుతానని బెదిరిస్తేనే నేను లొంగలేదు.. మీ బెదిరింపులు నేను పట్టించుకుంటానా? అయినా నయీం ఆస్థులు కొట్టేసిందెవరో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు.
12. నా పై వేసిన తప్పుడు కేసుల పై కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్లకుండా నన్ను ఆపాలని చూస్తే… ప్రజలే చూసుకుంటారు.
13.అస్సైన్డ్ భూమి నుంచి నేను రోడ్డు వేసినట్టు నిరూపించగలరా?
అస్సైన్డ్ భూములున్న ఊరి సర్పంచ్ నాకు మద్దతుగా మాట్లాడాడు. తర్వాత మాట మార్చి నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాడు?
14. వైఎస్ఆర్ బలం ముందే నిలబడ్డాను.. ఇప్పుడు నాపై కేసులు పెడితే ఏమౌతుంది?
15. మీతో 20 ఏళ్లు పనిచేశాను.. ఒకర్ని టార్గెట్ చేస్తే ఎలా ఖతం చేస్తారో నాకు తెలుసు? మీతో ఎడ్జెస్ట్ కాలేకపోతున్నానని నాపై మీరు సిస్టమ్ ను ఎలా ప్రయోగిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఆ విషయం మీకు తెల్వదా?
16. నాపై మీరు ఎన్ని కేసులు పెట్టగలరు.. నన్ను మీరు ఎన్ని రోజులు జైళ్లో పెట్టగలరు?
17. ఏమి చేసినా నా ఆత్మాభిమానాన్ని చంపలేరు. గత 20 ఏల్ల మీ కుటుంబ గుట్టు విప్పుతా… ఇది కేవలం ఆరంభమే…
18. నా మొత్తం సంపాదన, ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా?