• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పీకే పొలిటికల్ జర్నీ ఇదే

NA bureau by NA bureau
May 4, 2021
in Politics, Top Stories, Trending
0
పీకే పొలిటికల్ జర్నీ ఇదే
0
SHARES
321
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గెలవటంలో ఎంత మజా ఉంటుందో గెలిపించటంలో కూడా అంతే మజా ఉంటుంది. గోలు కొట్టిన తర్వాత  ఆటగాళ్ళు ఎంతంగా సంబరాలు చేసుకుంటారో వాళ్ళ కోచ్ కూడా గ్రౌండ్ బయట అంతే హ్యాపీగా ఫీలవుతారు. ఇదంతా ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ (పీకే) గురించే.

ఒకేసారి ఇటు తమిళనాడులోను అటు పశ్చిమబెంగాల్లోను డీఎంకే, తృణమూల్ అధికారంలోకి రావటం వెనుక పీకే కృషి కూడా చాలానే ఉంది.

నిజానికి తమిళనాడుకు పశ్చిమబెంగాల్ కు సంస్కృతిపరంగానే కాకుండా రాజకీయ వాతావరణంలో కూడా చాలా తేడా ఉంటుంది. అయినా కానీ ఇటు స్టాలిన్ అటు మమతబెనర్జీ ఇద్దరూ తమను ఎన్నికల్లో గెలిపించేందుకు ఒకేసారి వ్యూహకర్తగా పీకేని నియమించుకున్నారు.

తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో మొదటిసారి డీఎంకే ఎన్నికలను ఎదుర్కొన్నది. అలాగే బెంగాల్లో మూడోసారి మమత ఎన్నికల పోరాటంలోకి దిగింది.

నిజానికి పీకేని మొదటగా గుర్తించింది నరేంద్రమోడినే. 2014లో మోడిని ప్రధానమంత్రిని చేసేందుకు పీకే బృందం దేశవ్యాప్తంగా చాలా కష్టపడింది. మోడి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడో ఇద్దరికీ చెడింది. దాంతో మోడికి పీకే దూరమైపోయారు.

అయితే మోడి విజయం వెనుక పీకే ఉన్నారనే ప్రచారం బాగా జరిగింది. దాంతో వెంటనే పీకేని బీహార్లో నితీష్ చేరదీశారు. తన వ్యూహకర్తగా  నియమించుకున్నారు. అప్పుడు నితీష్ కూడా మంచి విజయమే సాధించారు.

ఆ తర్వాత పీకేని పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. అయితే యూపీలో దారుణంగా విఫలమైనా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ మంచి విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత ఏపి ఎన్నికల్లో విజయం కోసం పీకేతో  జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేశారు. జగన్ అద్భుత విజయం సాధించటంతో వెంటనే స్టాలిన్, మమతలు పీకేతో ఒప్పందం చేసుకున్నారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లలో గెలిచింది. దాంతో క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను అంచనా వేసుకన్న దీదీ వెంటనే పీకేను వ్యూహకర్తగా నియమించుకున్నది. ఇదే సమయంలో తమిళనాడులో స్టాలిన్ కూడా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు.

దాదాపు ఇద్దరితోను ఏకకాలంలో రెండేళ్ళు  పీకే బృందం పనిచేసింది. స్టాలిన్, మమత స్టామినాకు పీకే వ్యూహాలు కూడా తోడైన కారణంగా ఇద్దరు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఇద్దరి విజయంలో కీలకపాత్ర పోషించిన పీకే ఇకనుండి తాను వ్యూహకర్త బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించం సంచలనమే. కాకపోతే మంచి విజయంలో ఉన్నపుడు రిటైర్ మెంట్ అయితే ఆ గౌరవమే వేరు. అందుకే ఇపుడు రిటైర్ మెంట్ ప్రకటించారు.

కొసమెరుపు – అయితే, పీకే గెలిపిస్తున్నాడు గాని దానికోసం అడ్డదారులు, డ్రామాలు ఎక్కువ ఆడతాడు అన్న నింద ఉంది. బెంగాల్లో మమత కాలికి కట్టుతో, జగన్ కి కోడికత్తితో అది నిజమైంది. చివరకు ఆ కోడికత్తి వ్యక్తి వైసీపీ టికెట్ కూడా వచ్చింది.

Tags: andhrapradeshchief justce of IndiaCongressIndiaPKprashanth kishorepunjabTamilnaduUPys jaganYSRCP
Previous Post

covid: స్పీకర్ తమ్మినేని పరిస్తితి విషమం

Next Post

Etela Rajendar: ఈ ప్రశ్నలతో కేసీఆర్ గుట్టు రట్టయినట్టే

Related Posts

టికెట్ రేట్లపై వారిని మాట్లాడొద్దంటున్న ప్రముఖ నిర్మాత
Movies

ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?

May 21, 2022
విన్నారా?…జగన్ బెయిల్ రద్దయితే జగన్ కే ఎక్కువ లాభమట
Andhra

జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ

May 21, 2022
జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
Andhra

జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?

May 21, 2022
చేతకాని వాళ్లు అసెంబ్లీలో కూర్చోవడం ఎందుకు? జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
Andhra

మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!

May 21, 2022
ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
Around The World

ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?

May 21, 2022
అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
Movies

అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…

May 21, 2022
Load More
Next Post
ఈటెల రాజేందర్ నివురుగప్పిన నిప్పు

Etela Rajendar: ఈ ప్రశ్నలతో కేసీఆర్ గుట్టు రట్టయినట్టే

Please login to join discussion

Latest News

  • ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?
  • జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ
  • జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
  • మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!
  • ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
  • అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
  • లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల
  • సిక్కోలు కోటలో సింగంలా లోకేశ్…రెస్పాన్స్ అదిరింది
  • ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి: బాల‌య్య మెసేజ్ ఇదే!
  • కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట
  • రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు
  • రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!
  • NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!
  • ఇక కేసీఆర్ పై పవన్ ‘యాక్షన్’షురూ…ఆయనే డైరెక్టర్
  • ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds