డాలస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల డాలస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టంగా తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్ లో జులై 9న (క్రవారం) జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతం. దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేసారు.
నిజాం నవాబు మాదిరి పరిపాలన జరుగుతున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం జరగాలని ఆకాంక్షిం చారు. ఈ అభినందన సభ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ లైవ్ లో పాల్గొని ఎన్నారైలని ఉద్యేశించి ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జూమ్ లైవ్ లో పాల్గొని తన అభిప్రాయాల్ని సభికులతో పంచుకున్నారు. ఎన్నారైలు కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు పర్యవేక్షించారు.