కరోనా ఉదృతంగా ఉండటంతో విద్యార్థుల తరఫున మర్యాదపూర్వకంగా, గౌరవమైన భాషలో పరీక్షల రద్దు కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కి లోకేష్ లేఖ రాశారు.
జగన్ వినలేదు. లేఖకి రిప్లై లేదు. పరీక్షల రద్దు ప్రకటన లేదు. లోకేష్ అడిగాడు కాబట్టి పరీక్షలు పెట్టాల్సిందే అని ఫిక్సయ్యాడు సీఎం జగన్.
తర్వాత లోకేష్ మరోసారి విన్నవించాడు. పోల్ పెడితే… అభిప్రాయసేకరణలో విద్యార్థులంతా ముక్తకంఠంతో పరీక్షలు వద్దన్నారు. తల్లిదండ్రులదీ అదే మాట. ప్రాణం ఉంటే చాలు, పరీక్ష లేకపోయినా పర్లేదు అన్నారు. అపుడు కూడా లోకేష్ వినతిని జగన్ లెక్కచేయలేదు.
పరీక్షలు పెట్టి తీరుతా, మే 5 న పరీక్షలు పెడతా అంటూ జగన్ తాజాగా ప్రకటించడంతో లోకేష్ ఇపుడు కోర్టుకు వెళ్లాడు. విద్యార్థుల తరఫున తెలుగుదేశం పార్టీ… విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్యం దృష్యా పరీక్షలను రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని కోర్టులో పిటిషను వేశారు.
దీంతో జగన్ పార్టీకి ఫీజులు ఎగిరిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టులు ఏ పరీక్షలకు అనుమతి ఇవ్వవు. ఇందులో అనుమానమే లేదు. జగన్ మొండికిపోయి లోకేష్ ని హీరోని చేశాడు. 20 లక్షల కుటుంబాలకు ఇపుడు లోకేష్ హీరో అయ్యే పరిస్థితి.