జగన్ వైఫల్యం చేతగానితనం వల్ల రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 25.9 శాతానికి చేరిందని… జగన్ తన అసమర్థత వల్ల ప్రజలను కరోనాకు బలిచేశాడని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
కరోనాలో జగన్ సర్కారు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే అని చంద్రబాబు విమర్శించారు. చివరకు కోర్టుకు కూడా తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నారు అని సంచలన ఆరోపణ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని ప్రశ్నలను జగన్ కి వేశారు.
- మూడు గంటల్లో బెడ్ ఇస్తాన్నారు…. ఒక్కరికైనా ఇచ్చారా?
- ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయిస్తాం అన్నారు. ఎక్కడ చేయించారు?
- దేశమంతటా విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తే ఒక్క జగన్ మాత్రం ఎందుకు చేయడం లేదు?
- ఇపుడు వ్యాక్సిన్ దొరకలేదు అంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు వ్యాక్సిన్ కి డిమాండ్ లేదు. అడిగినన్ని ఇచ్చారు. ప్రజలకు ఎందుకు అప్పటివరకు వ్యాక్సినేషన్ ఉదృతంగా చేయలేకపోయారు?
- 10 వేలు వసూలు చేయాల్సిన వెంటిలేటరుకు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నా జగన్ ఎందుకు అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడం లేదు.?
ఇవన్నీ తప్పులు జరగడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు. ముఖ్యంగా అధికారంలోకి రాగానే రియల్ టైం గవర్నెన్స్ టెక్నాలజీని పక్కన పెట్టారు. అది వాడుకుని ఉంటే ఈపాటికి ఎపుడో రాష్ట్రంలో కరోనా కంట్రోల్ అయ్యేదని చంద్రబాబు అన్నారు. దానిని జగన్ పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా ఫెయిలయ్యాడన్నారు.
అలాగే ప్రజలను చైతన్యం చేయడంలో విఫలం అవడమే కాకుండా దేశంలో అందరికంటే ముందే మందు షాపులు తెరిపించిన ఘనుడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు.