తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ‘ప్రజా పాలన విజయోత్సవ సభ’ను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి…మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా? అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఫుల్ కో..హాఫ్ కో బ్రాండ్ అంబాసిడర్ అని, తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడని సెటైర్లు వేశారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని, అక్కడికే తమ డబ్బులతో మందు కూడా పంపుతామని రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓడిపోయారని కేసీఆర్ ప్రజల మొహం చూడరా? బయటకు రారా? అని నిలదీశారు. ఈ పదవి తనకు ఎవరూ ఇవ్వలేదని, కష్టపడి పైకి వచ్చానని, ఎందరినో తొక్కుకుంటూ వచ్చానని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వబోనని రేవంత్ ఛాలెంజ్ చేశారు.