రెమ్యునరేషన్ విషయంలో ఈ జనరేషన్ టాప్ స్టార్స్ కు మెగాస్టార్ చిరంజీవి గట్టి పోటీ ఇస్తున్నారు. సీనియర్స్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా వెలుగొందుతున్న చిరు.. తాజాగా తన రెమ్యునరేషన్ ను మరింత పెంచేశారట. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సోసియో-ఫాంటసీ మూవీ ఇది. త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.
యూవి క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వంభర కోసం చిరు రూ. 60 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తదుపరి సినిమా కోసం అంతకు మించి రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. విశ్వంభర అనంతరం చిరు `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యాచురల్ నాని ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
అయితే శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే ప్రాజెక్ట్ కోసం చిరంజీవి ఏకంగా రూ. 75 కోట్లు రెమ్యునరేషన్ అందుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయింది. చిరంజీవి మునుపటి సినిమాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుందని.. అంతేగాక మెగాస్టార్ ను సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నానని శ్రీకాంత్ ఓదెల ఇటీవల పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం కాస్టింగ్ ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం.