టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. కొనియా డారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ… `చంద్రబాబు విజనరీ` అని పేర్కొ న్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ నుంచి.. 2014-19 మధ్య విభజిత ఆంధ్ర ప్రదేశ్ వరకు కూడా.. చంద్రబాబు ఎంతో కృషి చేశారని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
2014-19 మధ్య రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారని తెలిపారు. ప్రధానంగా అమరావతి రాజధాని కోసం ఎంతో శ్రమించి.. నవనగరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. నదులఅనుసంధానం ద్వారా.. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలబెట్టేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని గవర్నర్ చెప్పారు. స్వయం ఉపాధి యూనిట్లు, రుణాలు ఇప్పిస్తూ.. ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించారని తెలిపారు. విభజన వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సమ్మిళిత అభివృద్ధి మంత్రంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
2014-19 మధ్య తీసుకువచ్చిన అనేక సంస్థలను గత ప్రభుత్వం వెళ్లగొట్టిందని.. ఒప్పందాలు రద్దు చేసుకున్నారని.. తద్వారా ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. దీనిని భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. దీనిని సరిచేసేందుకు కూడా ప్రస్తుత ప్రబుత్వం కృషి చేస్తోందన్నారు. చంద్రబాబు దూరదృష్టి, ఆయనకు ఉన్న ఆలోచన వంటివి.. రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపించడం తథ్యమన్నారు.
విభజన అశాస్త్రీయం!
ఈ సందర్భంగా ఏపీ విభజనపైనా గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీ యంగా విడదీశారని తెలిపారు. ఎలాంటి చర్యలు లేకుండానే తెలుగు రాష్ట్రాన్ని విడదీశారని తెలిపారు. ఏపీ విభజన.. రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందన్నారు. ఏపీకి తగినంత పరిహారం ఇవ్వలేదని, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని చెప్పారు.