ఏపీలో కరోనా రెండో దశ వ్యాప్తిని నిరోధించడం, మృతులను తగ్గించడం.. వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సీఎం జగన్.. తన మొండి వైఖరితో ప్రజల జీవితాలు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
`జగన్.. ప్రజల ప్రాణాలు తీసే అధికారం నీకు ఎవరిచ్చారు?“ అని నిలదీశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నా.. వైద్య అందక, ఆక్సిజన్ లభించక అల్లాడుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ తన తాడేపల్లి ఇంద్ర భవనం నుంచి కాలు బయటకు పెట్టడం లేదన్నారు.,
ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రజల మధ్య వెళ్లి భరోసా కల్పించాల్సిన సీఎం.. ఉద్యోగి మాదిరిగా టైం చూసు కుని.. సమీక్షలు పెట్టి.. పబ్బం గడుపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చేయి దాటిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నా.. జగన్కు, ఆయన మంత్రులకు చీమ కుట్టినట్టు లేద ని.. ఎవరైనా అడిగితే.. ఏదైనా ప్రశ్నిస్తే… వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు.
ఇది తప్ప జగ న్కు పాలన తెలియడం లేదని.. తీవ్రస్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా పదో తరగతి .. ఇంటర్ పరీక్షలను నిర్వహించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నా.. ఈ ముఖ్యమంత్రికి పట్టడం లేదని.. చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ఇప్పటికే జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా.. 130 మంది ఉపాధ్యాయులు కరోనాకు బలి అయ్యారు. విజయనగరంలో ఒక పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా సోకిందని.. దీంతో అక్కడి తల్లిదండ్రులే తమ పిల్లలను పంపించేది లేదని.. హెచ్ ఎంకు సెలవు చీటీలు పంపించారన్నారు.
దీనిని బట్టి ప్రభుత్వ తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో.. అర్ధం చేసుకోవచ్చని, అయినా..ఈ ముఖ్యమంత్రికి మాత్రం విద్యార్థుల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న జగన్.. అసలు పిల్లలు ప్రాణాలతో ఉంటేనే కదా..వారికి భవిష్యత్తు ఉంటుంది.. ఈ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా జగన్ రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షలు నిర్వహించరాదని బాబు పేర్కొన్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని.. సీఎంకు సూచించారు.
Sri @ncbn addressing the media about the failure of the YSRCP Government in managing the COVID-19 crisis in Andhra Pradesh – Live https://t.co/e8DLYcho3I
— Telugu Desam Party (@JaiTDP) April 28, 2021