సరైన టైంలో సరైన క్వశ్చన్… దత్తత తండ్రిని జగన్ ఆ సామం కూడా అడగలేరా..!
వైసీపీ అధినేత జగన్పై జనం ఆగ్రహంతో ఉన్నారు. వరదల సమయంలో ఆయన వైఖరి సరైన విధంగా లేదనిమెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి సాయం అందించేలా చేయడం కేవలం రాష్ట్ర సర్కారు బాధ్యతే కాదని, కేంద్రంతో నిన్న మొన్నటి వరకు అంటకాగిన జగన్ కు కూడా బాధ్యత ఉంటుందని అంటున్నారు. కనీసం కేంద్రానికి ఒక్క లేఖ రాయడం కానీ.. తన వారితో చెప్పించ డం కానీ ఆయన చేయలేదు.
కేంద్రంలోని నరేంద్ర మోడీకి.. జగన్ దత్తపుత్రుడు.. అంటూ కొన్నాళ్ల కిందట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన విషయాలు.. దాని తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తమ వోడికి తిరుగులేదని కూడా సంబరాలు చేసుకున్నారు. మరి అలాంటి దత్తు తండ్రిని ఇప్పుడు దత్త పుత్రుడు ఎందుకు ప్రశ్నించడం లేదు.
ఎందుకు సాయం చేసేలా కనీసం లేఖలు రాయడం లేదన్నది ప్రశ్న. అంతేకాదు.. కేంద్రంలో తన వారు చాలా మంది ఉన్నారు. విజయసాయిరెడ్డి వంటివారికి కేంద్ర మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పోనీ.. వారి ద్వారా అయినా.. సాయం అందేలా చేయొచ్చు కదా! అలా కూడా చేయడం లేదు. ఏపీ ప్రజల సమస్యలు వివరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
అంతేకాదు.. రాజకీయ అవసరాలకు.. తన కేసులకు సంబంధించి మాత్రమే కేంద్రంతో సంబంధాలు పెట్టుకుంటారా? అప్పుడు మాత్రమే మాట్లాడతారా? అప్పుడు మాత్రమే లేఖ రాస్తారా? అనేది ప్రధాన చర్చగా మారింది. ఇప్పుడు కీలకమైన సమయంలో ప్రధాని మోడీకి లేఖ రాయడమో.. కేంద్రానికి ఫోన్లు చేయడమో చేసి.. సాయం అందేలా చేయాల్సిన జగన్ మౌనంగా ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్న వారు పెరుగుతున్నారు.