ఇంతకుముందులా థియేటర్ ఏదైతే ఏముంది.. సినిమా చూస్తే చాలు అన్నట్లుగా లేదు ఇప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్. స్క్రీన్ బాగుండాలి.. పిక్చర్ క్లారిటీ ఉండాలి. సౌండ్ సిస్టం బాగుండాలి.. స్క్రీన్ పెద్దగా ఉంటే బెటర్.. ఇలా అన్నీ చూసుకుని థియేటర్లకు వెళ్తున్నారు.
పాత కాలం నాటి డొక్కు థియేటర్లలో సినిమా చూడ్డానికి చాలా మంది ఇష్టపడట్లేదు. టికెట్ రేటు ఎక్కువైనా పర్వాలేదని మల్టీప్లెక్సుల్లో మంచి క్వాలిటీతో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్న వారు పెరుగుతున్నారు. ఆ మల్టీప్లెక్సులు కూడా ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అయితే తప్ప ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమవుతోంది.
పెద్ద సిటీస్‌లో అధునాత టెక్నాలజీతో కొత్త మల్టీప్లెక్స్ వస్తే దాని వైపు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి టైంలో హైదరాబాద్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్ కూడా కొత్త హంగులపై దృష్టిసారిస్తోంది.
ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని థియేటర్లు పాతబడి పోతుండడంతో కొవిడ్ టైంలో రెనోవేషన్లు జరిగాయి. అక్కడ ఆల్రెడీ హైదరాబాద్ సిటీలోనే అది పెద్దదైన ఐమాక్స్ స్క్రీన్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా అందులో ఇంగ్లిష్ త్రీడీ, ఐమాక్స్ సినిమాలు రిలీజవుతుంటాయి.
ఇప్పుడు ప్రసాద్స్లోనే అతి పెద్ద తెరను ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఉన్న పెద్ద స్క్రీన్‌నే మార్చి దీన్ని అమర్చారా లేక కొత్తగా ఇంకోటి ఏర్పటు చేశారా అన్నది క్లారిటీ లేదు. కానీ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ మాత్రం కొత్తగా ఇప్పుడు ఏర్పాటువుతన్నదే అని సమాచారం. దీని పొడవు 64 అడుగులు కాగా.. వెడల్పు 101.6 అడుగులు కావడం విశేషం.
ఇండియాలో ఇంత వెడల్పు ఉన్న స్క్రీన్ ఇంకెక్కడా లేదు. పొడవు (నిలువుగా) విషయంలో అయితే ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద స్క్రీన్ అట. మామూలు స్క్రీన్లతో పోలిస్తే ఇది దాదాపు డబుల్ అని చెప్పొచ్చు. దీని సౌండ్ సిస్టం అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుందట.
బహుశా ‘అవతార్-2’ రాబోతున్న నేపథ్యంలోనే ఈ ఏర్పాటు కావచ్చు. మున్ముందు రాబోయే భారీ చిత్రాలు చూస్తున్నపుడు ప్రపంచ స్థాయి అనుభూతిని కలిగేలా ఈ స్క్రీన్‌ను తీర్చిదిద్దినట్లున్నారు. ఇది హైదరాబాద్ సిటీ సినీ ప్రేమికులకు తీపి కబురే.
Check out the exclusive @IMAX artwork for #AvatarTheWayOfWater, only in theaters December 16.
Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/2E2rK97TxS
— Avatar (@officialavatar) November 21, 2022