యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తాజాగా వచ్చిన చిత్రం భారతీయుడు 2(ఇండియన్ 2). దాదాపు 28 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ ఇండస్ట్రీస్‌లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన భారతీయుడు మూవీకి సీక్వెల్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన భారతీయుడు 2 మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
కమల్ హాసన్ తనదైన యాక్టింగ్ తో స్క్రీన్ పై మరోసారి మ్యాజిక్ ని క్రియేట్ చేసినప్పటికీ.. కథా, కథనంలో దమ్ము లేకపోవడం, శంకరం మార్క్ కనిపించకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. టాక్ అనుకూలంగా లేకపోవడం వల్ల కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారతీయుడు 2 మూవీ ప్రస్తుతం డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం ఐదు రోజుల కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీ.. ఐదు రోజుల్లో రూ. 12.36 కోట్ల షేర్, రూ. 20.65 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇంకా రూ. 12.64 కోట్ల షేర్ వస్తే గానీ తెలుగులో సినిమా సేఫ్ అవ్వదు. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఐదు రోజుల్లో భారతీయుడు 2 మూవీకి రూ. 59.25 కోట్ల షేర్, రూ. 121.70 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
సినిమా ఓవరాల్ బిజినెస్ రూ. 170 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 172 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 హిట్ అవ్వాలంటే ఇంకా రూ. 112.75 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి టార్గెట్ లో సగం కలెక్షన్స్ కూడా వచ్చేలా కనిపించడం లేదు.