వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వల్లభనేని వంశీ వేసిన హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ వేసిన పిటిషన్ను కొట్టేసింది. బెయిల్ మంజూరు చేసేది లేదంటూ తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచన చేసింది. హైకోర్టు ఆదేశాలతో వంశీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇకపోతే టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి వ్యవహారంలో వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ పై నాలుగు రోజుల క్రితం వంశీని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా జైల్లో అదనపు వసతులు కావాలంటూ వంశీ మరో పిటిషన్ వేశారు. విజయవాడ అట్రాసిటీ కోర్టులో ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగబోతుంది.