టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వయసైపోయింది….2024 ఎన్నికలనాటికి చంద్రబాబు 73 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించడం, పాలనా వ్యవహారాలు చూసుకోవడం చాలా కష్టం అంటూ పేటీఎం బ్యాచ్ కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇలా వయసైపోయిందంటూ చంద్రబాబును విమర్శించే వారికి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు దీటైన జవాబిచ్చారు.
2024 నాటికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారి వయసులతో చంద్రబాబు వయసును పోలుస్తూ లెక్కలతో సహా వెల్లడించారు. దేశ ప్రధాని మోడీ సైతం 2024 నాటికి 73వ పడిలోకి వస్తారని, చంద్రబాబు కూడా 73వ పడిలో ఉంటారని గుర్తు చేశారు.
73 ఏళ్ల రజనీకాంత్..(ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రస్తుతం లేరు)
70 ఏళ్ల స్టాలిన్,
69 ఏళ్ల కమల్ హాసన్ తమిళనాడులో,
80 ఏళ్ల యడ్యూరప్ప,
75 ఏళ్ల సిద్దరామయ్య,
63 ఏళ్ల కుమార స్వామి, కర్ణాటకలో…
79 ఏళ్ల పినరయ్ విజయన్,
80 ఏళ్ల ఊమన్ చాందీ కేరళలో,
69 ఏళ్ల కెసిఆర్,
78 ఏళ్ల జానా రెడ్డి తెలంగాణలో,
78 ఏళ్ల నవీన్ పట్నాయక్,
75 ఏళ్ల నిరంజన్ పట్నాయక్ ఒడిస్సాలో,
72 ఏళ్ల అశోక్ గెహ్లాట్,
70 ఏళ్ల వసుందరా రాజె రాజస్థాన్‌లో,
76 ఏళ్ల కమల్‌నాధ్,
64 ఏళ్ల శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యప్రదేశ్ లో,
69 ఏళ్ల మనోహర్‌లాల్ ఖట్టర్,
76 ఏళ్ల భూపిందర్ సింగ్ హుడా హర్యానలో,
90 ఏళ్ల వీరభద్ర సింగ్ హిమాచల్ లో,
82 ఏళ్ల శరత్ పవార్ మహారాష్ట్రలో,
81 ఏళ్ల అమరీందర్ సింగ్ పంజాబ్ లో,
69 ఏళ్ల మమతా బెనర్జీ బెంగాల్ లో,
67 ఏళ్ల మాయావతి ఉత్తర ప్రదేశ్ లో,
73 ఏళ్ల మోడీ ఢిల్లీలో….
ఇలా దేశవ్యాప్తంగా ఇంతమంది నేతలు ఆ వయసులో రాజకీయాలు చేయగలిగినప్పుడు వారిలో చాలామంది కంటే చిన్న, మిగిలిన వారికి కొద్దిగా అటు, ఇటుగా 2024 కి 73 ఏళ్ల వయస్సులో ఉండే చంద్రబాబు రాజకీయాలు చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల కంటే చాలా చురుకుగా, అందరి కంటే ఎక్కువగా కష్టపడి, నిరంతరం ప్రజలతో ఉండే చంద్రబాబు పాలన చేయలేరా అని నిలదీస్తున్నారు.
ఇప్పటికీ నవయువకుడిలా ఎనర్జీతో ఉంటే చంద్రబాబుతో సమానంగా తిరుపతి మెట్లు ఎక్కే దమ్ము, చంద్రబాబులా విజన్ తో ఆలోచించగలిగిన సమకాలీన రాజకీయనాయకుడు ఎవడైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే యువనేత, నవతరంగం, నవలా నాయకుడు అని వైసీపీ నేతలు పిలుచుకునే సీఎం జగన్ కూడా 2024 నాటికి 52వ పడిలోకి వచ్చేస్తారని గుర్తు చేస్తున్నారు.
కాబట్టి చంద్రబాబు వయసు మీద ఫోకస్ చేయడానికి బదులుగా కరోనా వ్యాప్తి కట్టడి, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలెండర్లు, వ్యాక్సినేషన్ పై జగన్ సర్కార్, వైసీపీ నేతలు ఫోకస్ చేయాలని తెలుగు తమ్ముళ్లు చురకలంటిస్తున్నారు.