సౌత్ సినీ పరిశ్రమలో నాలుగు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కానీ ముదురు ముద్దుగుమ్మల్లో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ఒకటి. యోగా టీచర్ గా కెరీర్ ప్రారంభించిన స్వీటీ.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మారింది. తనదైన గ్లామర్ మరియు టాలెంట్ తో అనతి కాలంలోనే భారీ స్టార్డమ్ సంపాదించుకుంది. కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించి సక్సెస్ అయింది. హీరోలతో సమానంగా నేమ్ అండ్ సేమ్ సొంతం చేసుకుంది.
అయితే ఇంతవరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. గతంలో చాలామంది హీరోలతో అనుష్క ప్రేమాయణం నడిపినట్లు పుకార్లు వచ్చాయి. ప్రధానంగా ప్రభాస్ అనుష్క లవ్ లో ఉన్నట్టు బలంగా ప్రచారం జరిగింది. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ చూసి వీరిద్దరి పెళ్లి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరూ ప్రేమ పెళ్లి వార్తలను కొట్టి పారేశారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ కుండబద్దలు కొట్టారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. విషయం ఏంటంటే.. అనుష్క త్వరలోనే ఓ ఇంటిది కాబోతోందట. దుబాయ్ కి చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని.. దుబాయ్ కి చెందిన సదరు వ్యక్తి అనుష్కకు బాగా నచ్చడంతో మ్యారేజ్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారం పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈసారైనా అనుష్క పెళ్లి వార్తలు నిజం అవుతాయా? లేక గతంలో మాదిరిగా పుకార్లు గానే మిగులుతాయా? అన్నది చూడాల్సి ఉంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ డైరెక్షన్ లో `ఘాతీ` అనే మూవీలో అనుష్క మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే `కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్` అనే మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ లో హీరోయిన్ గా స్వీటీ నటిస్తోంది.