అమెరికా పర్యటనలో భాగంగా జనసేన టీమ్ అట్లాంటా నిర్వహించిన NDA కూటమి సమావేశంలో పాల్గొనడానికి జార్జియాలో ఉన్న వంశీకృష్ణ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, జార్జియా స్టేట్ అసెంబ్లీ సభ్యులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా జార్జియా రాష్ట్ర ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బర్న్స్, సెనేటర్ షేక్ రెహ్మాన్, సెనేటర్ షాన్ స్టిల్, జాన్స్ క్రీక్ కౌన్సిల్ మెంబర్ బాబ్ ఎరమిల్లి, ప్రతినిధి సూ హాంగ్, ప్రతినిధి కార్టర్ బ్యారెట్, ప్రతినిధి టాడ్ జోన్స్ గార్లను కలుసుకుని అభిప్రాయాలు పంచుకున్నారు. శ్రీని అవుల ఈ పర్యటనని మొత్తం పర్యవేక్షించారు.
ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, జార్జియా రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేయడం, పరస్పర సహకారం పెంపొందించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అదనంగా, జార్జియా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని డిప్యూటీ గవర్నర్ను కలుసుకున్నారు.
ఈ పర్యటన ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, అమెరికా రాష్ట్రాల మధ్య మరింత బంధాన్ని పెంచే దిశగా చర్చలు జరిగాయి.