వైఎస్ఆర్టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో అతి త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. షర్మిల, అనిల్ కుమార్ దంపతుల తనయుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. చట్నీస్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు ప్రియ అట్లూరితో రాజారెడ్డి పెళ్లి వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశముంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియ కుటుంబం అమెరికాలో సెటిలైంది.
అమెరికాలో చదువుతున్న రాజారెడ్డి, ప్రియ ఒకరినొకరు ఇష్టపడటంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించారు. 4 సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును రాజారెడ్డి పూర్తి చేశారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ నుంచి పట్టా అందుకునే కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు షర్మిల దంపతులు అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా వారు ప్రియను కలిసినట్టు తెలుస్తోంది.