అధికారం నిలబెట్టుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు. సభలు, బస్సు యాత్రలు, ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు.. కానీ ఇవేమీ ఫలితం ఇవ్వడం లేదు. జనాల్లో వ్యతిరేకత తగ్గడం లేదు. మరి ఓట్లు పొందాలంటే ఎలా? ఇక మభ్యపెట్టడం, డబ్బుతో ఆశ చూపడమే మిగిలింది. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే చేస్తోందని తెలిసింది. జగన్ ఎంత చేసినా కూటమిదే విజయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో చివరి ప్రయత్నంగా డబ్బు పంపిణీని పెద్ద ఎత్తులో చేసేందుకు జగన్ సిద్ధమయ్యారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ను ఓడించేందుకు ఆ మూడు నియోజకవర్గాల్లో ఎంతైనా సరే పంచేయాలని జగన్ ఆదేశించారని సమాచారం.
కుప్పం నుంచి చంద్రబాబు, పిఠాపురం నుంచి పవన్, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి విజయం ఇప్పటికే ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లు గెలిస్తే జగన్ అహం దెబ్బతింటుందనే టాక్ ఉంది. అందుకే ఎలాగైనా సరే వీళ్ల ఓటమి కోసం ఎంతకైనా తెగించేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. ఇప్పటికే వ్యక్తిగత దూషణలు, కుటుంబం పేరు చెప్పి విమర్శలు చేసే స్థాయికి దిగిపోయిన జగన్.. ఇప్పుడు నోట్లతో ఓట్ల కొనుగోలుకు రెడీ అయ్యారని తెలిసింది.
ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యం పంపిణీపై వైసీపీ ఆధారపడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఓటు కోసం రూ.4 వేల చొప్పున పంపిణీ చేసేందుకూ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే స్థానిక కూటమి నేతలనూ ప్రలోభాలకు గురిచేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ముందుగా మంగళగిరిలో డబ్బు పంపిణీ ప్రారంభించినట్లు, ఓటర్లు ఎంత అడిగితే అంత వైసీపి ఇస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ డబ్బులు పంచినా, ఇతర ఏ ప్రలోభాలకు గురి చేసినా బాబు, పవన్, లోకేష్ విజయాలను అడ్డుకోవడం సాధ్యం కాదని కూటమి నేతలు ధీమాతో ఉన్నారు.