జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రజల్లో మమేకం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో వివిధ కార్యక్రమాలు పెట్టుకుని ప్రజల మధ్యకు వచ్చిన పవన్.. తర్వాత కాలంలో కీలకమైన ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే వారాహి యాత్రలు ప్రారం భించారు. ఇప్పటికే వారాహి 1.0, వారాహి 2.0లను నిర్వహించారు. ఆయా యాత్రల్లో వైసీపీ ప్రభుత్వాన్ని, పాలనను, నాయకులను కూడా టార్గెట్ చేసుకున్నారు.
ఒకానొక దశలో రాజకీయ దుమారం కూడా రేగింది. ఇదిలావుంటే, ఇప్పుడు వారాహి 3.0 యాత్ర ప్రారంభం కానుంది. విశాఖపట్నం నుంచి ఆయన ఈ యాత్రను గురువారం ప్రారంభించనున్నారు. అయితే.. యా త్ర ఇంకా ప్రారంభం కాకముందే.. విశాఖలో వైసీపీ నాయకులు తడిపేసుకుంటున్నారంటూ.. జనసేన నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకింత భయం అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా అనకాప ల్లి ఎమ్మెల్యే కమ్.. మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు.
వారాహి పర్యటన నేపథ్యంలో మంత్రి అమర్నాథ్.. జనసేనానిని ఉద్దేశించి 10 ప్రశ్నలు సంధించారు. అయితే.. అధికారంలో లేని నాయకుడి గురించి.. ఇంత దడిసిపోవడం ఎందుకు అనేది జనసేన నేతల ఎదురు దాడి. విశాఖను రాజధానిగా ప్రకటిస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ఒక్క తట్ట మట్టి మీరు వేశారా? ఉన్న పరిశ్రమలను, ఐటీ సంస్థలను వెళ్లిపోయేలా వ్యవహరించింది. మీరు కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. వారాహియాత్రకు వస్తున్న ప్రజాదరణతో ఉలిక్కి పడుతున్నారా? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.
మొత్తానికి విశాఖలో పవన్ పర్యటన సహజంగానే వైసీపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేయడం ఖాయమనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా పవన్ సంచలన విషయాలను ప్రస్తావించడం ఖాయమని కూడా అంటున్నారు.
+ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్
+ ఎమ్మెల్యే అనంతబాబు డ్రైవర్ కిడ్నాప్
+ రుషి కొండ వివాదాస్పద అంశం
+ డాక్టర్ సుధాకర్‌పై వేధింపులు
+ గంజాయి రవాణా, కేసులు
+ వైసీపీ నేతలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు
+ ఐటీ పరిశ్రమలు వెళ్లిపోవడం వంటివాటినిపవన్ ప్రధానంగా టార్గెట్ చేయొచ్చని తెలుస్తోంది.