ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి పవన్ సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు.
సచివాలయం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న తన ఛాంబర్‌ను పవన్ పరిశీలించనున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. పవన్ కు 212 గదిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు పక్కపక్క గదుల్లోనే తమ విధులు నిర్వర్తించనున్నారు.
సచివాలయంలో తన ఛాంబర్‌ను పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబుతో పవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కు వై ప్లస్ సెక్యూరిటీ, ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం కేటాయించింది.