వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రకటించిన 94 మంది టీడీపీ అభ్యర్థులు ఎట్టి పరిస్తితిలోనూ గెలిచి తీరాలని పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అన్ని కోణాల్లోనూ ఆలోచించే పొత్తులు ప్రకటిం చామని చెప్పారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న విధానాలకు భిన్నంగా తాజాగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు బాబు తెలిపారు.
ప్రతి ఒక్కరి మద్దతు, ఆశీర్వాదం ఉండాలనే ఉద్దేశంతో ప్రజల నుంచి ఐవీఆర్ ఎస్ ద్వారా సర్వేల ఫలి తాలు రాబట్టామన్నారు. ‘‘పార్టీ అభ్యర్థలును కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందుకో సం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. అలాగే సర్వే నివేదికలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి“ అని చంద్రబాబు అన్నారు.
తాజాగా చంద్రబాబు టికెట్లు పొందిన అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఈ సంద ర్భంగా వారిని కార్యోన్ములను చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి? ఏయే అంశాలపై చర్చించా లి? వంటిఅంశాలపై దిశానిర్దేశం చేశారు. “ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు. చిన్న తప్పు, పొరపా టు కూడా జరగకూడదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం. ప్రజల్లోనే ఉండాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం“ అని చంద్రబాబు వెల్లడించారు.
ఇక, వైసీపీ అధినేత, సీఎం జగన్‌పైనా విమర్శలు గుప్పించారు. జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధంగా లేడని అన్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం దౌర్జన్యాలు, అక్రమాలు.. దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరూ ఊహించని స్థాయిలో జగన్ సహా వైసీపీ నాయకులు కుట్రలకు దిగుతారని, వాటిని ఛేదించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.