లేటు వయసులో మంచి స్పీడు మీదున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. మధ్యలో అనారోగ్యం, రాజకీయ రంగప్రవేశ ఆలోచన వల్ల ఆయన ఆచితూచి సినిమాలు చేశారు కానీ.. అనారోగ్యం నుంచి కోలుకుని, రాజకీయ ప్రవేశం వద్దనుకున్నాక తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ‘జైలర్’తో భారీ విజయాన్నందుకున్న సూపర్ స్టార్.. ఈ ఏడాది ‘లాల్ సలాం’తో ప్రేక్షకులను పలకరించాడు.
ప్రస్తుతం ఆయన ‘జై భీమ్’ దర్శకుడు టీజీ జ్ఞానవేల్‌తో ‘వేట్టైకారన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రజినీ చేయాల్సిన చిత్రం ఎప్పుడో ఖరారైంది. ఖైదీ, విక్రమ్, లియో చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో ఆయన జట్టు కట్టబోతున్నాడు. రజినీ 171వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ జూన్‌లో సెట్స్ మీదికి వెళ్లబోతోందని ఇటీవలే దర్శకుడు లోకేష్ కనకరాజ్ వెల్లడించాడు.
సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. డెనిమ్ షర్టు.. కూలింగ్ గ్లాస్.. చేతికి వాచీలతో కూడిన సంకెళ్లతో రజినీ చాలా స్టైలిష్‌గా కనిపించాడీ ఫస్ట్ లుక్‌లో రజినీ. సినిమా మొదలవడానికి చాలా ముందుగానే ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా లాంచ్ చేయబోతున్నారు.
ఏప్రిల్ 22కు డేట్ ఫిక్స్ చేశారు కూడా. ఈలోపు రజినీ పాత్ర గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడట. రజినీ ఇలాంటి పాత్ర ఇంతకుముందెన్నడూ చేయలేదని కూడా అతనంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమాకూ డ్రగ్స్ లింకు పెట్టి ‘ఎల్సీయూ’లో ఏదో ఒక కనెక్షన్ ఉండేలా చూసుకున్నాడు లోకేష్. కానీ రజినీ సినిమా మాత్రం స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ అట. ఇందులో డ్రగ్స్ ప్రస్తావనే ఉండదట. లోకేష్ తీసిన వేరే సినిమాలు వేటితోనూ దీనికి కనెక్షన్ కూడా ఉండదట.
వివేకం Full movie ( vivekam – vivekananda reddy biopic )
నా ఆత్మ కథ
మీ కోసం ఈ పూర్తి చిత్రం
నా బిడ్డ బస్సు లో వస్తే చూపించండి#VivekamMovie pic.twitter.com/2SoRGlJNKd
— YS Vivekananda Reddy {Parody} (@ysvivekareddy) March 29, 2024