టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ పై విజయ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు ‘లైగర్’ ప్రమోషన్లను హోరెత్తించిన విజయ్…తాజాగా మరో ప్రమోషన్ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సారి సోషల్ మీడియాను టార్గెట్ చేసిన విజయ్…సోషల్ మీడియా సెలబ్రిటీ ఎన్.ఎమ్.నిహారికతో వైరల్ వీడియో చేశాడు. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల ద్వారా నిహారికకు భారీ ఫాలోయింగ్ ఉంది. నెటిజన్లతో పాటు సెలబ్రిటీల దృష్టిని కూడా నిహారిక ఆకట్టుకుంంది. అందుకే, ‘కేజీయఫ్’, ‘సర్కారు వారి పాట’, ‘రన్ వే 34’, ‘జెర్సీ’ (హిందీ వెర్షన్), ‘మేజర్’..వంటి చిత్రాలను నిహారిక తనదైన శైలిలో ప్రమోట్ చేసింది.
ఆ చిత్రాల హీరోలతో కలిసి నిహారిక చేసిన ప్రమోషనల్ వీడియోలు బాగ పాపులర్ అయ్యాయి. అందుకే, లైగర్ ప్రమోషన్ కోసం రౌడీ హీరో నిహారికతో ఫైట్ చేసి మరీ ఓ ప్రమోషన్ వీడియో చేశాడు. ఈ సారి ప్రమోషన్ కోసం ఏకంగా ‘లైగర్’తోనే నిహారిక ఫైట్ కు సిద్ధమైంది.విజయ్‌తో ఓ రేంజ్ లో ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు బిల్డప్ ఇచ్చిన నిహారిక…చివరకు రౌడీ సిక్స్ ప్యాక్ చూసి క్లీన్ బౌల్డవుతుంది. కానీ, రౌడీ హీరో మాత్రం ఆమెకు దూరం జరుగుతుంటాడు.
దీంతో, విజయ్ ను పంచ్ చేయడానికి బదులు…అతడిని హగ్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. ఇక, లైగర్ లో నత్తి ఉన్న క్యారెక్టర్ ను ఇక్కడ ప్రమోట్ చేశాడు విజయ్. దీంతో, ఆ నత్తిని నిహారిక ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం ఫన్నీగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది.