• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఈ పులస చేప రేటు తెలిస్తే షాకవుతారు

admin by admin
August 24, 2022
in Andhra, Top Stories
0
0
SHARES
522
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాల్సిందే అన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక నానుడి. అలా ఉంటుంది పులస చేపకు డిమాండ్. డిమాండే కాదు, ఆ డిమాండుకు తగ్గ రేటు…రేటుకు తగ్గ రుచి కూడా ఉంటుంది. అందుకే, రేటు ముఖ్యం కాదు..పులస దొరికితే చాలు అని పులకరించిపోయే పులసాభిమానులు చాలామంది ఉన్నారు. కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే దొరికే పులస చేప రుచిని జీవితంలో ఒక్కసారైనా చూడాలని తెలుగోళ్లంతా…ముఖ్యంగా గోదారోళ్లు ఉవ్విళ్లూరుతుంటారు.

వర్షాకాలంలో మాత్రమే చాలా అరుదుగా దొరికే పులస గోదావరి నదికి ఎదురీదుతూ వెళుతుంది. పులస చేపల రుచి మరే చేపకు రాదు. ఒకసారి దాని రుచి మరిగిన వారు జీవితంలో మర్చిపోలేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పులసకు వీరాభిమానులే. అందుకే, వాటికి అంత గిరాకీ. ఇక, జాలర్ల వలలో వందల చేపలు పడడం ఒక వైపు అయితే….ఒక్క పులస చేప పడడం మరోవైపు అన్నట్లుంటుంది లెక్క.

పులస చేపను కొనేందుకు వందలాదిమంది జనం కూడా క్యూ కడుతుంటారు. ఇక, పులసకున్న డిమాండ్ నేపథ్యంలో ఏ ఒక్కరికో దానిని అమ్మలేక వేలం పాటలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ విధంగా, తాజాగా గోదావరిలో ఓ జాలరి వలలో పడ్డ పులస చేప రికార్డు ధరకు అమ్ముడుపోయింది. మామూలుగా అయితే కేజీ 4 నుంచి 5 వేలుంటుంది. కానీ, తాజాగా రెండు కేజీల బరువున్న పులస చేప ఏకంగా 20 వేలకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.

గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు పులస చేపలు చిక్కుతున్నాయి. దీంతో, యానాం మార్కెట్లో వాటి విక్రయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్వహించిన వేలంపాటలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రెండున్నర కిలోల పులస చేపను రూ. 19 వేలకు పార్వతి అనే మహిళ దక్కించుకుంది. ఆ తర్వాత భైరవపాలేనికి చెందిన వ్యక్తికి దానిని రూ. 20 వేలకు అమ్మేసింది. ఈ సీజన్‌లో పులసకు పలికిన అత్యధిక ధర ఇదేనని మత్స్యకారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం రెండున్నర కిలోల పులస చేప రూ.21వేల ధర పలికింది. ఇదే, చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస’ చేప అంటారు.

Tags: huge price for pulasa fishpulasa fishpulasa in godavari waterRs.21 thousand for pulasataste of pulasa fish
Previous Post

Niharica : వేసుకున్నదే బికినీ, అది కూడా జారిపోతోంది

Next Post

నిహారికతో లైగర్ ఫైట్..ఎవరు గెలిచారంటే…

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

నిహారికతో లైగర్ ఫైట్..ఎవరు గెలిచారంటే...

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra