అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ -2 లాంచ్ ఈవెంట్ సందర్భంగా బాలకృష్ణను యాంకర్ సరదా ప్రశ్నలడిగారు. ఇంట్లో ఎవరు అన్స్టాపబుల్ అని అడగ్గా..తన భార్య వసుంధర అంటూ బాలకృష్ణ జవాబిచ్చారు. భార్యగా ఆమె లభించడం తన అదృష్టమని, తనను, తన కుటుంబాన్ని భరిస్తుందని బాలయ్య అన్నారు. తనకు సంబంధించిన అన్ని విషయాల్లో సగం కంటే ఎక్కువ అని చెప్పారు.
తనకు NBK 107 మూవీ టీమ్, అన్స్టాపబుల్ టీమ్ రెండూ ఇష్టమేనని, తన మన భేదం తనకు లేదని అన్నారు. ప్రపంచం మారియిందని, వినోదం థియేటర్స్, టీవీలు దాటి మన అరచేతిలోని స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేసిందని బాలయ్య అన్నారు. ఈ రెండో సీజన్ ఇంకా సూపర్ హిట్ అవుతుందని, ఫ్యాన్స్ అభిమానమే తనకు శ్రీరామరక్ష అని చెప్పారు. సినిమాలతో పాటు ఓటీటీ షోలలో కూడా కొనసాగుతానని అన్నారు.
‘నేను మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా..?’ అని బాలయ్యను యాంకర్ అడగడంతో ఆయన ఫన్నీ సమాధానమిచ్చారు. ‘ఏంటి మావయ్య అని పిలుస్తావా..? నేను నా మనవళ్లతో తాతయ్యే అని పిలుపించుకోను. ఎంత ధైర్యం నీకు. నా చేత మావయ్య అని పిలుపించుకుంటావా..? నా చిన్న మనవడు నన్ను బాలయ్య అని పిలుస్తాడు. నా పెద్ద మనవడు గోల తాత అని పిలుస్తాడు. ఇదే నా సమాధానం…’ అంటూ బాలకృష్ణ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ఈ ఇద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.