దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్యత లేకపోతే.. కేంద్రం ఆయా రాష్ట్రాలపై పెత్తనం చేయడంఖాయమని తమి ళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. “ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కావొచ్చు. రేపు మరొకటి కావొచ్చు.. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా లేకపోతే భవిష్యత్తులో మనం మూడో తరగతి వ్యక్తులుగా, రాష్ట్రాలుగా నిలిచిపోతాం. ఈ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది“ అని స్టాలిన్ స్ఫస్టం చేశారు.
చెన్నై వేదికగా.. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ.. సీఎం స్టాలిన్ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, విపక్ష నాయకుడు కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ సహా పలువురు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయా నాయకులను ఉద్దేశించి సీఎం స్టాలిన్ ప్రసంగించారు. జనాభాను ఆధారంగా చేసుకుని చేస్తున్న పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటు స్థానాలను కోల్పోతాయని తెలిపారు.
అయితే.. ఇలా పార్లమెంటు స్థానాలను కోల్పోతే.. ఏం జరుగుతుందన్న ప్రశ్న కొందరు తెలివిగా లేవనెత్తు తున్నారని అన్నారు. కానీ, రేపు చట్టాలను చేసే అవకాశం కూడా.. మనకు అనుకూలంగా లేకపోయే ప్రమా దం పొంచి ఉందని స్టాలిన్ తెలిపారు. “మన దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయి.. తృతీ య శ్రేణి పౌరులుగా మిగిలిపోతాం“ అని హెచ్చరించారు. ప్రస్తుతం జనాభా పరంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్న బలం దక్షిణాది రాష్ట్రాలకు లేదని స్టాలిన్ చెప్పారు.
పునర్విభజన ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదన్న స్టాలిన్.. న్యాయబద్ధంగా అందరికీ ప్రాతినిధ్యం పెరిగే లా మాత్రమే పార్లమెంటుస్థానాలను పునర్విభజన చేపట్టాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ కోసం గతంలో దక్షిణాది రాష్ట్రాలు అనేక తిప్పలు పడిన విషయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ ప్రస్తావించారు. ఆ కృషి అంతా ఇప్పుడు పోతుందని, కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండి.. ఈ విషయంలో అవసరమైతే పోరాటానికి కూడాదిగాల్సి ఉందని తేల్చి చెప్పారు.