ఏపీ సీఎం జగన్ తెలుగు ఎంత తేటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదంటూ చాలాకాలంగా టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో లోకేష్ పొరపాటున అన్న పదాలను పట్టుకొని పనిగట్టుకొని మరీ వైసీపీ సోషల్ మీడియా వింగ్, వైసీపీ నేతలు చేసి ట్రోలింగ్ కు టీడీపీ సోషల్ మీడియా వింగ్, టీడీపీ నేతలు రివేంజ్ తీర్చుకుంటున్న వైనం వైరల్ గా మారింది. ‘కొట్టారు తీసుకున్నాం, మాకు టైం వస్తది, మేము కొడతాం’ అంటూ సినీ ఫక్కీలో గతంలో జగన్ చెప్పిన డైలాగ్స్ ను ‘వైసీపీ అండ్ కో’కు చాలాకాలంగా టీడీపీ అప్పజెబుతూనే ఉంది.
నత్తి పకోడీ జ్ఞాన గుళికల పేరుతో జగన్ ను టీడీపీ చాలాకాలంగా ట్రోల్ చేస్తోంది. ‘తేట’ తెలుగు ‘తాట’ తీస్తున్న జగన్ వీడియోలను వైరల్ చేస్తూ వస్తోంది. గతంలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ ప్రకటన సందర్భంగా రాజమహేంద్రవరాన్ని “రాజమహేంద్ర వర్మ” అంటూ జగన్ వదిలిన ‘జ్ఞానగుళిక’ అప్పట్లో వైరల్ అయింది. గుంటూరును ‘గుండూరు’ అని, హిందూపురాన్ని ‘సింధుపురం’ అని, విశాఖని ‘ఉషాక’ అని, టెక్కలిని ‘టెక్కిలి’ అని, నవులూరుని ‘నలుగులూరు’ అని జగన్ చేసిన కామెడీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు
గర్భం దాల్చిన చెల్లెమ్మలను అని చెప్పబోయి…గర్వం దాల్చిన అనేయడంతో అంతకుముందు కూడా జగన్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. గర్వానికి…గర్భానికి కూడా తేడా తెలీని సీఎం అంటూ నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. ఇంగ్లిష్ అంతకన్నా రాదు అంటూ ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్పీచ్ సందర్భంగా జగనన్న నోటినుంచి జాలువారిన మరికొన్ని ఆణిముత్యాల వీడియో ఇపుడు వైరల్ గా మారింది.
ఈ దేశం పైరు పచ్చలతో(పచ్చటి పైరు), మన దేశ సమరయోధుల త్యాగ నిరిధి(త్యాగ నిరతి)కి, వారి స్వేద్వంతో(బహుశా సేద్యం అయుంటుంది), సామాజిక అభ్ర..అభ్ర..(అభద్రత అని చెప్పబోయి అబ్రకదబ్ర అన్నంత పనిచేశాడు), నెహ్రూ ఉటికించారు(ఉటంకించారు అనబోయి..ఉడికించారు అనేయబోయి ఉటికించారు అన్నాడు)…ఇక అక్కచెల్లెమ్మలకు హార్ధికంగా..(ఆర్థికంగా)..అంటూ జగన్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, జగన్ కబంధ హస్తాలలో చిక్కుకున్న తెలుగు భాషకు విముక్తి ఎప్పుడని, జగన్ వేసిన సంకెళ్లను తెలుగు తల్లి ఎప్పుడు తెంచుకుంటుందని, జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం రాలేదు…అని ట్రోలింగ్ జరుగుతోంది.