తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గరలోని ధర్నా చౌక్ దగ్గర వైఎస్ షర్మిల చేపట్టిన కొలువు దీక్ష సందర్భంగా హైడ్రామా నడిచింది. దీక్షకు ఒక్కరోజే అనుమతించిన పోలీసులు….షర్మిలను వెళ్లిపోవాలని కోరారు. దీంతో,కొలువు దీక్ష తర్వాత ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు షర్మిల తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భగ్నం చేశారు.
పోలీసులు అడ్డుకుంటున్నా పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఒక దశలో షర్మిల స్పృహతప్పి పడిపోయారు. షర్మిల చేయికి బలమైన గాయమైంది.పోలీసులకు వ్యతిరేకంగా అభిమానుల నినాదాలు చేస్తున్నారు.
తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండానే దీక్ష చేస్తానన్నాు. తనను పోలీసులు గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ప్రజల కోసం షర్మిల నిలబడిందని, షర్మిల పోరాటం కొనసాగుతుందని వైఎస్ విజయలక్ష్మీ చెప్పారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. పోలీసులు హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మీ తెలిపారు.
దీక్ష సందర్భంగా సాక్షి మీడియాపై షర్మిల కీలక వ్యాఖ్యలు చే అక్కడే ఉన్న సాక్షి ఛానెల్‌కు చురకలు వేశారు. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా… ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేశారు. దీంతో, విజయలక్ష్మి ఒక్కసారిగా బిత్తరపోయారు. పక్కనే ఉన్న విజయలక్ష్మి వెంటనే తేరుకుని.. షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అయినా సాక్షి చానెల్ ను షర్మిల టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది..