ఔను.. ఇప్పుడు ఏ ఇద్దరు కలుసుకున్నా.. వేస్తున్న లెక్కలు ఇవే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి పార్టీలు దక్కించుకునే ఫస్ట్ సీటు ఇదే అనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అదే.. గుడివాడ నియోజకవర్గం. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమే. వరుస విజయాలు దక్కించుకున్న కొడాలి నానిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోం ది. ఆయన పైకి ఎన్ని మాటలు చెప్పినా.. అంతర్గతంగా పరిస్థితి మాత్రం ఆయనకు చాలా వ్యతిరేకంగా కనిపిస్తోంది. దీంతో ఇక్కడ మార్పు ఖాయమనే వాదన వినిపిస్తోంది.
గుడివాడ నియోజకవర్గం నుంచి బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నారై నాయకుడు.. సేవాగుణం ఉన్న వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. అయితే.. ఇక్కడి ప్రజలు ఒకవైపు అభ్యర్థిని చూస్తూ నే మరోవైపు మార్పు వైపు అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే.. ఇక్కడ కొడాలికి వ్యతిరేక టాక్ వచ్చేసింది. ప్రత్యర్థుల పక్షాన అభ్యర్థి ఎవరైనా.. ఈ సారి మార్పు చేయాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారికి అభ్యర్థి కూడా బలమైన నాయకుడు దొరకడం గమనార్హం.
దీంతో ఎన్నికలకు ముందే.. గుడివాడలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. 20 ఏళ్లు గెలిపించినా.. ఇంకా అభివృద్ధి చేస్తా.. అక్కడ ఇళ్లు కట్టిస్తా.. ఇక్కడ రోడ్లు వేయిస్తానంటూ.. కొడాలి చెబుతున్న వాదనను ఇక్క డి మెజారిటీ వర్గాలు తిప్పి కొడుతున్నాయి. ఇన్నాళ్లుగా ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకా దు.. ఇవన్నీ.. ఆయన చెబుతున్నట్టే బోగస్ మాటలనికూడా అంటున్నారు. “అన్నం మొత్తం పట్టుకుని చూ డక్కర్లేదు. ఇప్పుడువచ్చిన రాము.. చాలా మంచి నాయకుడని అందరూ అంటున్నారు“ అని స్థానికంగా పెద్ద టాక్ నడుస్తోంది.
దీంతో గుడివాడ సీటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కూటమి అభ్యర్థులు ఫస్ట్ దక్కించుకునే సీటుగా పార్టీ నాయకులు చెబుతున్నారు.దీనికి తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా ఇక్కడ ట్రెండ్ మారడం.. కొడాలిని ఇరకాటంలోకి నెడుతోంది. డీసెంట్ ఓటర్లు పెరుగుతున్నారు. ఒకప్పుడు మాస్‌గా ఉన్న జనాలు కూడా.. డీసెంట్ పాలిటిక్స్‌ను కోరుతున్నారు. బూతులు తిట్టడం.. విరుచుకుపడడం వంటివాటికి వారు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే.. ఇక్కడ కూటమి అభ్యర్థి, వినయ శీలి, విద్యావంతుడు.. డీసెంట్‌గా ఉండే నాయకుడు విజయం తథ్యమని అంటున్నారు.